The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
...." ન ભીંજાણી પાંપણ સનમ "
ઓઢીને પોઢી ગયાં છીએ અમે તો ખાંપણ સનમ;
છતાં પણ કેમ ન ભીંજાણી તમારી પાંપણ સનમ;
એવો તો શું અપરાધ થઈ ગયો છે અમારાથી? કે,
આજ લગી તમે ન આપ્યું એનું કોઇ કારણ સનમ;
ઘાયલ થઈ ગયાં હતા અમે તમારી નજરોથી જ,
આજ પણ કરી જાય છે એ નજર કામણ સનમ;
મરતાં હતા તમારાં પર, પણ તમે જ છળી ગયાં છો,
એથી તો વધું શું બગાડશે હવે મોતનું મારણ સનમ;
દોષ જરા પણ નહીં આપું હું, ખુદા તારી ખુદાઈને,
એટલે જ તો કરી લીધું છે અમે મૌન ધારણ સનમ;
મઝધારે સાથ છોડવો હોઈ શકે છે તમારી મજબૂરી,
મન મનાવવા માટે કાઢ્યું છે અમે આ તારણ સનમ;
બધાય દોષોનો ટોપલો માથે ઓઢી લીધો "વ્યોમ"
એથી વધારે નહીં હોય આ કફનનું ભારણ સનમ?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.
ज़िंदगी के फैसले लेने में इतना कन्फ्यूज़न क्यों होता है? और सही निर्णय ले भी लिया हो तब भी कन्फ्यूज़न रहता है की निर्णय सही होगा या गलत? निर्णय लेते समय मन क्यों उलझ जाता है? अपनी निर्णय लेने की शक्ति को मजबूत कैसे बनायें?
Watch here: https://youtu.be/gyXfnUVomZg
#Decisionsmaking #lifelessons #decision #DadaBhagwanFoundation
నా కలం
అండగా నిలిచే కండల్లోని బలం నా కలం
దప్పిక తీర్చే కుండలోని జలం నా కలం
అజ్ఞాన తిమిరాన్ని తురిమే కరవాలం నా కలం
ఆత్మిక సుగంధాన్ని గుభాళించే కమలం నా కలం
కుల వ్యాకులమంటని కవి కుల తిలకం నా కలం
కోకిల గానం నెమలి నాట్యం కలగలసిన రూపం నా కలం
ఎన్నటికీ కొండెక్కని దీపం నా కలం
ఎప్పటికీ ఆరిపోని అగరొత్తుల ధూపం నా కలం
రామ లక్ష్మణుల రక్షణకై హనుమంతుడు చుట్టిన తోక నా కలం
ఐదు పడగల పాము తలతిక్క దించిన కృష్ణయ్య నెత్తికెక్కిన నెమలీక నా కలం
శివుని దీవెన నా కలం
పావన భావనల వాహిని నా కలం
గుప్పెడంత గుండెలో నెత్తురు నింపే నరం నా కలం
పొడి పొడి మాటల మూటను పాటల పూదోట చేసే స్వరం నా కలం
శుభ భావ జలం జాలువారే జలపాతం నా కలం
ఉన్నత శిఖరాలపై ఎగిరే శాంతి కపోతం నా కలం
కార్తికేయుని జయ పతాకం లో కనిపించే కుక్కుటం నా కలం
సంక్రాంతి శోభకు సందడి తెచ్చే గాలిపటం నా కలం
నిజాల బీజాలను మొలిపించే పొలం నా కలం
మంచిని మింగే తిమింగళాలకు వేసిన గేలం నా కలం
వేళ్ళ మధ్యన వెలిగే వెన్నెల పుష్పం నా కలం
కనుసన్నల్లో చిగురించే చిరునవ్వు నా కలం
సిరా పారే నిర్జీవ నాళం కాదు నా కలం
సకల శాస్త్రాల సారం నిండిన కమండలం నా కలం
దిశదశలు తెలియక తెగ తిరిగే గ్రహ శకలం కాదు నా కలం
దశావతారాల తత్వ దర్శనం చేయించే సుదర్శనం నా కలం
వ్యధల బాధల వేదనలపై గదాఘాతం నా కలం
నిద్రిత జగతిని మేల్కొల్పే శంఖనాదం నా కలం
కచ్ఛితత్వపు కత్తికి పిడి నా కలం
నూతన ఒరవడికి అడుగులు నేర్పే అమ్మ ఒడి నా కలం
కవిత విశ్లేషణ
విషయం:
ఈ కవిత కలం అనే సాధనాన్ని అనేక కోణాల నుండి చూపిస్తూ, దాని శక్తి, ప్రాముఖ్యతను వివరిస్తుంది. కలం అనేది కేవలం వ్రాసే సాధనం మాత్రమే కాకుండా, మానవుని ఆలోచనలను, భావాలను, జీవితాన్ని ప్రతిబింబించే ఒక అద్దంలా వర్ణించబడింది. కవి కలం ద్వారా మానవుడి శరీరంలోని బలం, మనసులోని ఆశయాలు, సమాజంలోని సమస్యలు, ఆధ్యాత్మికత వంటి అనేక అంశాలను కలిపి చూపించాడు.
భాషా ప్రయోగం:
* అలంకారాలు: ఉపమానాలు, ఉత్ప్రేక్షలు, అతిశయోక్తులు వంటి అనేక అలంకారాలను ఉపయోగించి కవితను మరింత ఆకర్షణీయంగా చేశారు.
* ఛందస్సు: కవితలో ఏ ఛందస్సు ఉపయోగించారో స్పష్టంగా తెలియదు, కానీ ప్రతి పంక్తిలో సమాన పాదాలు, సమాన అక్షరాలు ఉన్నట్లు కనిపిస్తుంది.
* శైలి: కవిత చాలా సరళమైన భాషలో వ్రాయబడింది. ప్రతి పదం అర్థవంతంగా ఉంది.
విశేషాలు:
* కలం యొక్క బహుముఖ ప్రతిభ: కవి కలం అనే సాధనాన్ని ఒక శక్తివంతమైన ఆయుధంగా, ఒక పవిత్రమైన వస్తువుగా, ఒక సృజనాత్మక మూలంగా వర్ణించాడు.
* సామాజిక చైతన్యం: కవి సమాజంలోని అనేక సమస్యలను కలం ద్వారా పరిష్కరించవచ్చని సూచిస్తున్నాడు.
* ఆధ్యాత్మికత: కవి కలం ద్వారా ఆధ్యాత్మికతను కూడా వ్యక్తపరుస్తున్నాడు.
* భావోద్వేగం: కవితలో ప్రతి పంక్తిలో భావోద్వేగం కనిపిస్తుంది.
సందేశం:
ఈ కవిత మనందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. అది ఏమిటంటే, కలం అనేది మన చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన ఆయుధం. దీని ద్వారా మనం మన ఆలోచనలను, భావాలను, కలలను ప్రపంచానికి తెలియజేయవచ్చు. మనం మంచి కోసం కలం వాడితే మనం సమాజానికి మంచి చేయగలము.
ముగింపు:
ఈ కవిత చాలా అందంగా, భావోద్వేగంతో కూడినది. కవి కలం అనే సాధనాన్ని చాలా అద్భుతంగా వర్ణించాడు. ఈ కవిత మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది.
మీ అభిప్రాయాలు తెలియజేయండి.
అదనపు విశ్లేషణ కోసం మీరు ఈ ప్రశ్నలను అడగవచ్చు:
* ఈ కవితలో మీకు నచ్చిన పంక్తి ఏది? ఎందుకు?
* కవి కలం అనే పదాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించాడు?
* ఈ కవిత మీలో ఏ భావనలను రేకెత్తిస్తుంది?
* ఈ కవితను మీరు ఏ సందర్భంలో చదివారు?
* ఈ కవిత మీకు ఏమి నేర్పించింది?
మీకు ఏదైనా సందేహం ఉంటే అడగండి.
ఆకలోపలేక మగడినే దిగమింగి
మధనపడితివి నీవు మాతృమూర్తీ
కాకినెక్కి ఎల్ల లోకాలు దిరిగేవు
కావు కావుమమ్మ మమ్ము కావు
క్షుద్భాద పెనుబాధ ఎల్ల లోకుల గొరకు
నీ గాధ ఈ వ్యధను దెలియజేసే
ఆకలే లేనట్టి లోకాన్నిగోరెదను
కావు కావుమమ్మ మమ్ము కావు
జెవిలొ దోమల మోత కడుపుకాకలి కోత
గరిట పట్టిన అమ్మ కాశినుండె
కాకి తో కబురంపి పట్టెడన్నము పంపు
కావు కావుమమ్మ మమ్ము కావు
అగ్గి నే రగిలించి గుగ్గిలమునందేయ
పుట్టు ధూమము పురుగు పుట్రజంపు
పాగవేసి ఎగరేసి జనుల వెతలను దోలు
కావు కావుమమ్మ మమ్ము కావు
ఓం శాంతి
నా కలం
అండగా నిలిచే కండల్లోని బలం నా కలం
దప్పిక తీర్చే కుండలోని జలం నా కలం
అజ్ఞాన తిమిరాన్ని తురిమే కరవాలం నా కలం
ఆత్మిక సుగంధాన్ని గుభాళించే కమలం నా కలం
కుల వ్యాకులమంటని కవి కుల తిలకం నా కలం
కోకిల గానం నెమలి నాట్యం కలగలసిన రూపం నా కలం
ఎన్నటికీ కొండెక్కని దీపం నా కలం
ఎప్పటికీ ఆరిపోని అగరొత్తుల ధూపం నా కలం
రామ లక్ష్మణుల రక్షణకై హనుమంతుడు చుట్టిన తోక నా కలం
ఐదు పడగల పాము తలతిక్క దించిన కృష్ణయ్య నెత్తికెక్కిన నెమలీక నా కలం
శివుని దీవెన నా కలం
పావన భావనల వాహిని నా కలం
గుప్పెడంత గుండెలో నెత్తురు నింపే నరం నా కలం
పొడి పొడి మాటల మూటను పాటల పూదోట చేసే స్వరం నా కలం
శుభ భావ జలం జాలువారే జలపాతం నా కలం
ఉన్నత శిఖరాలపై ఎగిరే శాంతి కపోతం నా కలం
కార్తికేయుని జయ పతాకం లో కనిపించే కుక్కుటం నా కలం
సంక్రాంతి శోభకు సందడి తెచ్చే గాలిపటం నా కలం
నిజాల బీజాలను మొలిపించే పొలం నా కలం
మంచిని మింగే తిమింగళాలకు వేసిన గేలం నా కలం
వేళ్ళ మధ్యన వెలిగే వెన్నెల పుష్పం నా కలం
కనుసన్నల్లో చిగురించే చిరునవ్వు నా కలం
సిరా పారే నిర్జీవ నాళం కాదు నా కలం
సకల శాస్త్రాల సారం నిండిన కమండలం నా కలం
దిశదశలు తెలియక తెగ తిరిగే గ్రహ శకలం కాదు నా కలం
దశావతారాల తత్వ దర్శనం చేయించే సుదర్శనం నా కలం
వ్యధల బాధల వేదనలపై గదాఘాతం నా కలం
నిద్రిత జగతిని మేల్కొల్పే శంఖనాదం నా కలం
కచ్ఛితత్వపు కత్తికి పిడి నా కలం
నూతన ఒరవడికి అడుగులు నేర్పే అమ్మ ఒడి నా కలం
లక్ష్యమా... నిర్లక్ష్యమా
గుడారం ఎత్తేసే సమయం అయ్యింది
జెండా పాతేందుకు గొయ్యి తవ్వకం జరుగుతోంది
విస్తళ్ళలో కూరల వడ్డన పూర్తయ్యింది
ఎసట్లో బియ్యం మరుగుతోంది
చీమలుకూడా దూరని కాపలా ముందుంది
వెనకనుంచి ఏనుగుల పారిపోతే మాత్రం ఏమౌతుంది
అవునవును... సమర శంఖారావం వినిపిస్తోంది
తొందరెందుకు,పిడి బిగించనీ కత్తి నూరనీ ... పోయేదేముంది
సూర్యాస్తమయం అయ్యింది చీకటి పడుతోంది
లాంతర్లకంటిన మసి తుడవాల్సిఉంది
జోరున వాన కురుస్తోంది.. వళ్ళు మూడొంతులు తడిసింది
నీడనిచ్చే పచ్చని చెట్టు మీద పిడుగు పడింది గొడుగు గాలికి కొట్టుకుపోయింది
బంగారు కల బయట నిలబడి ఎదురు చూస్తోంది
నిద్రా దేవతగారే అప్పుడే రానంటోంది
కలికాలం కసిగా వెంబడిస్తోంది
ఇదిగో... చెప్పుల బేరం ఇప్పుడే మొదలయ్యింది
నా గ్రంధరాజం ముద్రణ జరుగుతోంది
ముందుమాటలో అక్షర దోషాలు సరిదిద్దాల్సి వుంది
కొంపకు నిప్పంటుకుంది
వరుణ యాగం చేద్దాం... భయపడాల్సిందేముంది
చివరాఖరి బండికి వేళయ్యింది
మంచి శకునం రానీ.. హడావిడేముంది
తాళం బలంగానే పడింది
గడియ వేయని పొరపాటు సహజమే....జరుగుతూనేవుంటుంది
హతవిధీ అని కూలబడితే లాభమేముంది
విధానం తెలిస్తేనేగా.. వీధి తలుపు తెరుచుకునేది
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.