ఆకలోపలేక మగడినే దిగమింగి
మధనపడితివి నీవు మాతృమూర్తీ
కాకినెక్కి ఎల్ల లోకాలు దిరిగేవు
కావు కావుమమ్మ మమ్ము కావు
క్షుద్భాద పెనుబాధ ఎల్ల లోకుల గొరకు
నీ గాధ ఈ వ్యధను దెలియజేసే
ఆకలే లేనట్టి లోకాన్నిగోరెదను
కావు కావుమమ్మ మమ్ము కావు
జెవిలొ దోమల మోత కడుపుకాకలి కోత
గరిట పట్టిన అమ్మ కాశినుండె
కాకి తో కబురంపి పట్టెడన్నము పంపు
కావు కావుమమ్మ మమ్ము కావు
అగ్గి నే రగిలించి గుగ్గిలమునందేయ
పుట్టు ధూమము పురుగు పుట్రజంపు
పాగవేసి ఎగరేసి జనుల వెతలను దోలు
కావు కావుమమ్మ మమ్ము కావు
ఓం శాంతి