రాధాకృష్ణ ....
తన కృష్ణ పయనాన జన్మంతా కలిసి వుండే రుక్మిణిని కాదు,
నా ప్రేమ కోసం పుట్టడానికి రాధ నీ కాదు,
కలిసి ఉన్న క్షణం లో ఆరాధించగలిగే సఖిని మాత్రమే నేను ,
ఈ క్షణం చాలంటు జ్ఞాపకాలన్నీ మనసున దాచే,
స్నేహాన్ని మాత్రమే నేను.....
కృష్ణ దరిచేరాలన్న రాధ ఆశ ,
కానీ ఒంటరితనం విధిరాత ,
బ్రంహరాతను మార్చడం కృష్ణ మాయకు సాధ్యపడలేదా,
లేక తన జన్మ కారణం కోసం రాధ ప్రేమని విడువక తప్పలేదా ,
కానీ అవే కారణాలలో ఒకటి రాధ ప్రేమ కాదా,
కృష్ణ తలపులలో రాధ జన్మ గడిచేన,
మనసున భారం జ్ఞాపకాలతో మరిచేన,
తలచే కొద్ది బరువేన,
మరిచే మార్గం తెలిసేన......