The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
little feelings.... The flowers are shining The happiness learned talking The seasons are changing The world of mine is still resting My mother started praying So her children be settling I can't explain her that one of her children want else something and The world of mine is still resting The chances are less, but The war is more The blood is lost But the life is still and The world of mine is still at rest The girl who is poetic Believes in magic Wishes the god for just one trick That vanishes the dark at every inch And still the world of mine is resting....... (I hope it will wake_up one day)
రాధాకృష్ణ .... తన కృష్ణ పయనాన జన్మంతా కలిసి వుండే రుక్మిణిని కాదు, నా ప్రేమ కోసం పుట్టడానికి రాధ నీ కాదు, కలిసి ఉన్న క్షణం లో ఆరాధించగలిగే సఖిని మాత్రమే నేను , ఈ క్షణం చాలంటు జ్ఞాపకాలన్నీ మనసున దాచే, స్నేహాన్ని మాత్రమే నేను..... కృష్ణ దరిచేరాలన్న రాధ ఆశ , కానీ ఒంటరితనం విధిరాత , బ్రంహరాతను మార్చడం కృష్ణ మాయకు సాధ్యపడలేదా, లేక తన జన్మ కారణం కోసం రాధ ప్రేమని విడువక తప్పలేదా , కానీ అవే కారణాలలో ఒకటి రాధ ప్రేమ కాదా, కృష్ణ తలపులలో రాధ జన్మ గడిచేన, మనసున భారం జ్ఞాపకాలతో మరిచేన, తలచే కొద్ది బరువేన, మరిచే మార్గం తెలిసేన......
ఆకాశం..... నింగిని చూసి మురిసిన సంద్రం, కోపమంతా క్షణం లో మాయమై, బుగ్గల మీద ఎరుపురంగు ల చేరి, సిగ్గు గా మారిన క్షణం అనిపించింది, సంద్రానికి ఆకాశమంటే, ఆ ఆకాశమంత ప్రేమని....... ప్రేమని చూసి మురిసిన బుగ్గల ఎరుపు, ఆనందాన్ని చూసి మురిసిన కళ్ళు, బాధని చూసి కురిసిన వాన, కష్టం తీరిపోయాక కలిగిన ప్రశాంతత, ఎక్కడికి వెళ్ళినా వెంట వచ్చే స్నేహం, రాత్రి కనే కలల ఆనందం, తప్పు జరిగితే వచ్చే కోపం, భావాలన్నీ రంగులుగా మార్చి చీర లా చుట్టేసుకున్న అందమె ఆకాశమేమో......
బహుశా.... రోజు ఏదొక బాధని చూసే మనసుకి, ఈ రోజు అన్ని ఆనందాలు కనిపిస్తున్నాయి ఏంటో, బహుశా సంకెళ్ళను తెంచేసిందేమో, విన్న ప్రతి పాటలోను, నన్ను నేను చూసుకున్న క్షణాలన్నీ, బుగ్గలు ఎరుపెక్కేలా మురిసిపోయాయి, బహుశా మురిసిన నా బగ్గుల ఎరుపుని చూసేయామో , ఇన్ని రోజులు నా మనసు గూటిలో దాగిన కోరికలన్నీ ఈ రోజు మాయమయ్యాయి, బహుశా , వాటి గమ్యాన్ని చేరుకున్నాయేమో, బహుశా, దొరికిందేమో ఇన్ని రోజులు వెతుకుతున్న రూపం, మనసులో భారం తగ్గిపోతుంది, బహుశా, భారాన్ని దించే మార్గం, నా ఎదురుగా నిలిచిందేమో, రోజు కలలో కనిపించే జీవితం ఒక్కసారిగా ఇలలో కనిపించిందేంటో, బహుశా, మేలుకుందేమో, నా కలల ప్రపంచం.....
మురిపెం.... నీ పెదవులు నా పేరు పలికితే విన్న చెవులకి మురిపెం, నీ ఆనందానికి నా బుగ్గలు మురిపెం, నీ నవ్వుకి నవ్వుతున్న రూపానికి, నా కనులకు మురిపెం, నీ ప్రేమకి నా ప్రేమ మురిపెం, నువ్వు రాసిన ప్రేమలేఖకి, లేఖలో రాసిన అక్షరాలు చదివిన మనసుకి నా సిగ్గు మురిపెం, నువ్వు తాకితే ఆ స్పర్శ మురిపెం, మన మధ్య జరిగిన చిన్ని చిన్ని ఆనందాలకు, సాక్షమైన ఈ కాలం మురిపెం, నువ్వు పెట్టిన ఒట్టు కి నా నమ్మకం మురిపెం, మన మధ్య ఉన్న స్నేహం మురిపెం, ఆ స్నేహాన్ని దాటిన ప్రేమ మురిపెం, మనం కలిసిన ఈ క్షణం కలిగిన భావం మురిపెం, కలవక ముందు నిన్ను సైగగా చూసి మురిసిన కళ్ళు ఇంకా మురిపెం......
నాట్యం..... డమరుకం చేసే శబ్దం, సంగీతం, చెవులను దాటి l, మనసుతో వినే, వేణుగాన సంగీతానికి, కృష్ణ, కళ్ళతో చూపిన భావం, హస్త ముద్రికల అర్ధం, వాటి కి తోడు, గాజుల, మువ్వల, స్నేహం , కనులను మురిపించే, ప్రయత్నమేమో ఈ రూపం, నాట్యం....
అంకితం..... మొదటి స్నేహం, తన మాటలు, నా మౌనం, పంచుకున్న ఒకే భావం, అందరినీ నవ్వించే గుణం, అర్ధం చేసుకోవడమే కాదు, అర్ధం అయ్యేలా చెప్పడం, బాధ్యతలను మోయడం, అందమె కాదు, ఆత్మాభిమానం, క్షమించే గుణం, తన జీవితం గురించే కాదు, మన అనుకున్న అందరి గురించి ఆలోచించే, ప్రియమైన మిత్రమా, ఈ కవిత , నీకే అంకితం......
అందమైన కథలన్నీ తెచ్చి గదిలో బంధించేసాను, ఒకొక్క పుస్తకం ఒక్కొక కథని వివరించి చెప్తుంటే, ప్రతి కథ లో యువరాణి నేనే అయిపోయాను, రచనలు ఎవరివైనా, సంగీతం లో ఆనందాన్ని వెతికి, ప్రస్తుతాన్ని మరిచి, నా అన్న ఊహల ప్రపంచంలో విహరించానూ, పుస్తకం చెప్పే కథని, సంగీతంలో అక్షరాలు చెప్పే భావాన్ని , అర్ధం చేసుకోవడం, అద్భుతం , ఆనందం, జ్ఞానం, అనుభవం చెప్పే పాఠం, జీవితం, ప్రస్తుత జీవితాన్ని తప్పించుకుని పారిపోవాలని మనసు పలికితే, సంతోషంగా పరుగులు తీసే అందమైన ఊహల ప్రపంచం......
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser