ఆకాశం.....
నింగిని చూసి మురిసిన సంద్రం,
కోపమంతా క్షణం లో మాయమై,
బుగ్గల మీద ఎరుపురంగు ల చేరి,
సిగ్గు గా మారిన క్షణం అనిపించింది,
సంద్రానికి ఆకాశమంటే,
ఆ ఆకాశమంత ప్రేమని.......
ప్రేమని చూసి మురిసిన బుగ్గల ఎరుపు,
ఆనందాన్ని చూసి మురిసిన కళ్ళు,
బాధని చూసి కురిసిన వాన,
కష్టం తీరిపోయాక కలిగిన ప్రశాంతత,
ఎక్కడికి వెళ్ళినా వెంట వచ్చే స్నేహం,
రాత్రి కనే కలల ఆనందం,
తప్పు జరిగితే వచ్చే కోపం,
భావాలన్నీ రంగులుగా మార్చి చీర లా చుట్టేసుకున్న
అందమె ఆకాశమేమో......