చదువు ధేనువు పొదుగు పితికి జ్ఞానము తాగు
ఎంతగా ఎదిగితే అంత ఒదుగు
నీకు నాకెల్లరకు అదియె బాగెప్పటికి
ధర్మమార్గంబిదియె ముందుకేగు
చదువు అనే కామధేనువు పొదుగును పితికి జ్ఞానమనే పాలను త్రాగాలి. ఎంతగా ఎదిగినా అంతగా ఒదిగి ఉండాలి.. ఇందులోనే సమాజ హితం ఉంది..కనుక ఈ ధర్మమార్గంలోనే ముందుకు సాగిపోవాలని భావం..ఓంశాంతి