నాన్న జ్ఞాపకాలు
నా కన్నులను ప్రమిదలుగా చేసుకొని,
ఆశలనే వత్తులు వేసి నీ రాకకై ఎదురు చూస్తున్నా...
నా పెదవులను వేణువుగా చేసుకొని,
నీ గొప్పతనం గురించి పాటగా ఆలపిస్తున్నా...
నా మనసును వనంగా చేసుకొని,
నీ జ్ఞాపకాల సుగంధాల పరిమళాలలో విహరిస్తున్నా...
నా యదను కోవెలగా చేసుకొని,
నీ ప్రతిమను ప్రతిష్టించి నిత్యం ఆరాధిస్తున్నా...
కరుణించి దర్శనం ఇవ్వు నాన్నా,
అరుదెంచి నన్ను నీలో ఐక్యం చేసుకో నాన్నా !!