నాన్న కవితలు
నాన్న !
నీకు నడక నేర్పించాడు,
నలుగురిని నీతో నడిపించమనే నడవడిక నేర్పించాడు.
నీకు మొదట రాత నేర్పించాడు,
అది నీ తలరాత మార్చేందుకు ప్రోత్సాహాన్నిచ్చాడు.
నీకు భయం వేస్తే ధైర్యాన్ని ఇచ్చాడు,
అతనికి భయం కలిగితే నిన్ను తలచుకున్నాడు.
నువ్వు తప్పు చేస్తే ఆవేశం చూపించాడు,
అసలు తప్పే చేయకుండా ఆరాటం చూపించాడు.
అతడు అస్తమిస్తూ నిన్ను అలరారింపచేశాడు.
ఓపిక లికపోయినా ఓదార్పు కోరుకోడు.
సత్తువ సన్నగిల్లినా సహనం కోల్పోడు.
అంతటి నాన్నకు నడమంత్రపు సిరి కాదు,
నిటారుగా నిల్చునే శక్తినివ్వు.
భుజం మీద వేసుకొని నిద్రపుచ్చిన నాన్నకు,
భుజం నువ్వై ధైర్యాన్నివ్వు.
అలుపెరుగని పోరాటం చేస్తున్న నాన్నకు,
ఆకలి తెలియనంత ఆనందాన్నివ్వు.