నీకు ఎవరూ లేరని బాధపడకు,
నీ మనస్సే నీకు తోడు…
చేయూతనిచ్చేవారు లేరని కృంగిపోకు,
చక్కని ఆలోచనే నీకు విజయాలు తెచ్చు…
ఎవరూ పట్టించుకోలేదని పలుచన అవకు,
నీవే పలుకరించి గుర్తింపు పొందచ్చు…
నడిపించే వారు లేరని కలతపడకు,
నీవే నడిపే సూత్రధారిగా ఉండు…
నవ్వ లేదని ముడుచుకొని ఉండకు,
నీ నవ్వు చూపి ఉత్సాహ పరుచు…
దారి కనపడలేదని చతికిలపడకు ,
నీ అడుగుజాడలే నీకు రాజమార్గం కావచ్చు…
ఎండిపోయిన ఆకులు చూసి బాధపడకు,
వచ్చిన చిగురు చూసి ఆనందించవచ్చు…
చిన్న చిరునవ్వుతో పలకరింపుతో,
ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించు…
- Yamini