సంద్రమందావిరై కురిసి నదిగా పారు
నీరు కొత్తజేయు కొత్తూరిలో
అట్లె కొత్త పనులు కలిగించు ఇబ్బంది
కొత్తలో కొద్దిగా సర్దుకొనుము
అన్ని నదులూ సముద్రంలో నీరు ఆవిరై మేఘాలుగా మారి వర్షించగా ఏర్పడినవే కానీ ఊరు మారినప్పుడు ఒక్కోసారి నీళ్ళు కొత్త చేస్తాయి అంటే వంటికి వెంటనే పడవు..అలాగే ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు మొదట్లో కాస్త ఇబ్బంది సహజమే..అలవాటయ్యే వరకూ సర్దుకోవాలని భావం..ఓంశాంతి