పాక్ సరిహద్దుల్లో జరిగిన విమాన ప్రమాదంలో సురక్షితంగా బయటపడి అక్కడి సైన్యానికి పట్టుబడి వారి ప్రశ్నలకు ధీటుగా బదులిచ్చిన భారతదేశ ముద్దుబిడ్డ విక్రమ్ అభినందన్ వర్ధమాన్ను రేపు విడుదలచేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంటులో ప్రకటించారు తాను నిన్న భారత ప్రధానితో మాట్లాడే ప్రయత్నం చేశానని కానీ వీలుపడలేదని పేర్కొన్నారు..జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను విడుదలచేయాలని భారత్ తొలినుంచీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపధ్యంలోనే అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ళకు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఇది భారత్ సాధించిన మరో దౌత్య విజయం