Telugu Quote in Poem by swathi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ఎవరు నీవు? నా గుండెలో నిలిచిపోయావు
ఎవరు నీవు? నా మదిని మీటిపోయావు
ఎవరు నీవు? నన్నే మార్చివేసావు
నాలోనే ఉంటూ... నీవుగా మారావు!
నీ శ్వాసలో నా శ్వాసను కలిపి
ఇరువురం ఒక్కటే అన్నట్టుగా మారావు
నా చీకటిలో దీపంలా... నా కాంతి కిరణంలా
నాలోని ఆశల జ్యోతివై నిలిచావు!
నాకూ ఒక జీవితం ఉందని, ఒక మనసుందని తెలిపావు
ఎప్పుడూ నా వెంటే నీడలా తోడున్నావు
నీ గుండెలపై వాలే ఆ క్షణం కోసం...
ప్రతి నిమిషాన్ని ఒక యుగంలా గడుపుతున్నాను!
ఆ దైవమే కరుణించి నిన్ను నా దరికి చేర్చి
ఆ యుగాన్ని కాసేపు ఆపివేస్తే...
నీతో కలిసే ఆ ఒక్క క్షణం కోసం
ఈ క్షణమే మరణించడానికైనా నేను సిద్ధం!

Telugu Poem by swathi : 112022130
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now