కొంపెక్కి కూసేను కోడి తెల్లారంగ
కూసేను కోకిలలు వాసంతమరుదెంచ
వేళపాళలు లేక వదరేరు మానవులు ఆయుష్షు అందుకే తగ్గిపోయే...
మంచి నీటిని తాగ అడుగు రోజులు పోయి
మంచి మాటలు కోరు రోజులొచ్చె పాలకుల పోలికలె ప్రజలకబ్బునుకదా
నైతికత నూతిలో దూకెనెపుడో
కతుకు మెతుకు నీవు
బతుకు బతుకుటకొరకు
మెతుకు కొరకు బతుకు బతుకు కాదు
కుక్కుటకె మనమున్న కుక్కుటము మేలయా
తను లేచి ఊరంత మేలుకొలుపూ