ప్రతి వాని మాటలో ప్రేమ వెదక్కు
అర్హత లేని ఎందరో జీవితంలో తారసపడుతుంటారు
అందరి ప్రేమలో
ఆప్యాయత,
నమ్మకం,
భద్రత,
బంధం ఉండవు అవసరం మాత్రమే ఉంటుంది
అందుకే
నమ్మకం లేని మాట
భద్రత ఇవ్వలేని బంధం
విలువనివ్వని మనిషి
ప్రేమ లేని మనసు వ్యర్థం
గనుక
నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకో
కొందరికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్యలాంటిది
సునాయాసంగా చింపిరి చేసి పోతారు
కాబట్టి జరా జాగ్రత్త!