ఎవడు...?
అవిద్యతో శిధిలమైపోయిన నా ఈ దేహమును
దేవాలయము గా సేయ జూచె దీనబంధుడెవ్వడు....
నాలో రక్కసుడు ని సంహరించి, ద్వైతము నుంచి అద్వైత
ఆనందపు అవధులను జూప హరుడెవ్వడు....
*అంతరం లో అలుముకున్న అజ్ఞానపు ముసురును
తరిమికొట్టి, కోటిసూర్యుల జ్ఞానా ప్రకాశాన్ని 'లో '
వెలుగొందజేయు పావనుడెవ్వడు.....
*తన పర భేద మెరుగక చెరపట్ట గా జూచె ,నాలోని
కాముకుడు ని కబళించ గా వచ్చే కాలకంఠుడెవ్వడు...
*'నేను' నేను' అనే నా అహాన్ని చంపి, తత్వజ్ఞానాన్ని బోధించేడి ఆ తాత్వికుడెవ్వడు....
నాది నాది అంటూ భ్రమలో బ్రతికేడి అల్పుడిని,
బ్రహ్మ్మము లోకి నడిపింప ఆ నారాయణుడెవ్వడు..
ఈ భవబంధాల సాలెగూడు నుంచి విడిపింప గా
మోక్షమిచ్చు ఆ విరూపాక్షుడెవ్వడు....
*అశాశ్వతపు ఇహమును విడచి సత్యమునెఱిగి శాశ్వతపు
పరమును'నే'చేరగా,సుందర సుమనోహరప్రేమపరిమళాలు చిందించు దరహాసమున, మధురమనోహరపుమధువులతో
మధురాధరామృతము కురిపించి మంత్రముగ్ధుల్ని చేయు
ఆ గోపాలుడి వేణునాదానికి 'నే''ను'గానమై పరవశింప
ఆత్మను పరిమళింపజేసితివి గద,
ఓ...నా..ప్రియ మాధవుడా.....!
.....మధు✍️