మాయ తో జరిగిన నా వాట్సాప్ సంభాషణ (వినూత్న సాహితీ ప్రయోగం)
రచన:బీ.కే. సాయి శ్యాం మనోహర్
సత్యనారాయణ పురం, విజయవాడ
ఆ రోజు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు
మామూలు రోజులకన్నా ఎక్కువ ప్రేమతో బాబాను స్మృతి చేస్తున్నాను
ఇంతలో ఒక అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది
ఆ నెంబర్ తో పాటు జరిగిన వాట్సాప్ సంభాషణ ఇది
హే ఆత్మ! ఎలా వున్నావు
నేను: బాగున్నాను
ఇంతకీ ఎవరిది
: నీ మరిది
నేను: 🤔
:😜 కాదు కాదు నీ మది
నేను: మదివా... మాయవా
మాయ: అవును నేను మాయనే.. ఇంతకీ ఎలా కనిపెట్టావు
నేను: అర కల్పంగా నా తోడున్నావు ఆ మాత్రం కనిపెట్టలేనా
మాయ: ఒప్పుకుంటున్నాను.. గడసరివే
నేను: అది సరే... ఇప్పుడెందుకు వచ్చావు
మాయ: ఊరికే.. పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దామని
నేను:క్షమించు మాయా..
నాకు తీరిక లేదు
మాయ: ఆ.... పలకరించడానికి కూడా వీల్లేనంతగా ఏం పనిలో మునిగిపోయావు
నేను: మునిగిపోలేదు... నిమగ్నమయ్యాను
మాయ: అదే... ఎందులో
నేను: ఇన్నాళ్ళూ నీ మత్తులో మునిగి తూగాను... తనువే నేనని భ్రమపడి కనిపించిన ప్రతి బొమ్మ వెంటపడి బెంబేలిత్తిపోయాను బేజారై పోయాను బెంగపడ్డాను
మాయ: అయితే ఇప్పుడేమంటావు
నేను: ఇక పై నీ జిత్తులు నా దగ్గర సాగవంటాను
పరమపిత ప్రియ శివ పరమాత్ముని మధుర స్మృతులనే సంకల్పాల ఆగరుబత్తులు వెలిగే నా మనో మందిరం లో నీ భ్రమలనే దోమలు రాలేవు.. వచ్చినా చచ్చి రాలకుండా పోలేవు
మాయ: హృదయం లేని ప్రేమికుడా....
కఠినాత్ముడా... కిరాతకుడా...
😭😭😭😭😭😭😭
నేను: చాలించు నీ మొసలి కన్నీళ్ళు..
నక్క 🦊 వినయాలు... నీ నయగారాలకూ ఒయ్యారాలకూ ఒరిగిపోడానికి నేనున్నది ఘోర కలియుగంలో కాదు
విశ్వ కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం లో
మాయ: అంతేనంటావా...
నేను: అంతే.... ఇక నీ అంతే
మాయ: అయితే నాకిక్కడ స్థానం లేదు.
. నాకు సెలవిప్పిచ్చు
నేను: వెళ్ళు మాయా... నీకిదే నా అంతిమ వీడ్కోలు
Note: You have permanently blocked this contact now you are unable to see or send messages
Unblock to continue