బ్రహ్మా బాబాకు జరిగిన మూడు సాక్షాత్కారాలు
ఇప్పటి వరకూ మీరు ఎన్నో రకాల విశ్వ విద్యాలయాల గురించి వినివుంటారు .... చూసి వుంటారు... వాటిలో చదివి పట్టభద్రులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విశ్వ విద్యాలయం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అత్యంత అద్భుతమైనది . ఇది మొత్తం విశ్వమంతటికీ దివ్య గీత యొక్క సత్య జ్ఞానాన్ని సహజ రాజా యోగాన్నీ నేర్పించాలనే మహోన్నత సదాశయం తో స్థాపించబడిన ఏకైక విశ్వ విద్యాలయం . ఇక్కడ శిక్షణ పొందే తన విద్యార్థులను ఆలయాలలో పూజలందుకునే
దేవతలుగా ఈ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి చెందిన అసాధారణ అమోఘ అద్వితీయ విశేష ప్రత్యేకత
పైగా ఇది పరమ పిత పరమాత్మ చే స్వయం గా స్థాపించబడిన ఏకైక విశ్వవిశ్వ విద్యాలయం .వినటానికి నమ్మ సఖ్యం కాని ఆశర్య కరమైన విషయమైనప్పటికీ
ఇది నూటికి నూరు పాళ్ళు సత్యం మధురమైన వాస్తవం ... అందుకే ఈ విశ్వ విద్యాలయాన్ని ఈశ్వరీయ విశ్వ విద్యాలయంగా ప్రారంభం లోనే పేర్కొనడం జరిగింది
ఐతే పరమాత్మ నిరాకారులు ఇంకా ఆజన్మ అనగా వారు మనలా జనన మరణ చక్రముల లోకి రారు కనుకనే వారు విశేష ప్రజ్ఞ కలిగిన అత్యంత అనుభవశాలి అయిన
ఒక వృద్ధ మానవుని శరీరం లోకి ప్రవేశించారు లోక కళ్యాణార్ధం మంగళ కర కార్యాలు చేయడం కోసం ఒకరి దేహం లోనికి నేరుగా ప్రవేశించడాన్నే అవతరణ అని
అంటారు. ద్వాపర యుగం లో వఛ్చిన ధర్మ స్థాపకులు తమ తమ ధర్మాల స్థాపన కోసం ఇదే పధ్ధతిని అవలంభించారు
ఇలా అవతరించిన పరమాత్ముడు తనకు ఆశ్రయమిచ్చిన ఆ వ్యక్తి శరీరానికి ప్రజా పిత బ్రహ్మా అనే కతవ్య నామాన్నొసగారు . ఇందుకే శివుడు నంది వాహనాన్ని అధిరోహించినట్లు చూపిస్తారు . నంది కొమ్ముల మధ్య భాగం లోనుంచి ఈశ్వరుని దర్శించమనటం లోనూ ఇదే ఆంతర్యం ఇమిడి ఉంది
ఆ జ్ఞాన గంగా ధారుణి తన వైపుకు ఆకర్షించి భువికి తెచ్చినందున వీరినే భగీరధుడు అని కూడా అంటారు . ఇప్పుడు వారి వ్యక్తిగత పరిచయం గురించి కొంత తెలుసుకుందాం .
........ ......... ......... ....... ఈశ్వర ప్రవేశం జరగక ముందు వారి నామధేయం దాదా లేఖ రాజు. వృత్తి రీత్యా వజ్రాల వర్తకుడు . పరమ విష్ణు భక్తుడు
వీరికి వ్యాపారం లో ఉన్న అపార అనుభవం కారణంగా అప్పటి రాజులతో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉంది వారు.....నిరంతర లోక కళ్యాణ భావన తో
వసుధైవ కుటుంబక ద్రుష్టి కోణం తో అందరికీ ఆదర్శవంతులుగా భాసిల్లేవారు
ఇలా కాలం గడుస్తుండగా ఒక నాడు వీరికి కలియుగీ ప్రపంచం యొక్క మహా భయంకర భీతావహ హృదయ విదారక దృశ్యాలు ఏకాంతంలో ఉండగా సాక్షాత్కరించాయి ఇందులో ప్రకృతిఆపదల ద్వారా అణు బాంబుల ద్వారా మాట కలహాల ద్వారా ప్రపంచ
మహా వినాశనం జరుగుతున్న దృశ్యాలు స్పష్టం గా కనిపించాయి . దాదాకు ఈ సాక్షాత్కారాలు జరిగిన సమయం లో అణు బాంబులు
ఇంకా ఆవిషరించబడలేదన్నది మరీ మరీ గమనించదగిన విషయం ..... ఆ సన్నివేశాలు తిలకించిన దాదా భావావేశానికి లోనై తన నేత్రాల వెంట అశ్రువులు ధర్నపాతంగా కారుతుండగా "ఇక చాలు ప్రభూ ..... చాలు ....... ఇంతటి భయంకర వినాశనమా .... ఇప్పుడు నాకు మీ సుందర రూపాన్ని చూపించండి "
అని ఆర్తి తో ప్రార్ధించారు ఆ తరువాత వారికి శ్రీ మహా విష్ణు సాక్షాత్కారమ్ జరిగి " అహం విష్ణు చతుర్భజమ్ తతః త్వం " అనే మాటలు వినిపించాయి .
'తతః త్వం' అంటే " నేనే నీవు నీవే నేను" అని అర్ధం. ఈ సాక్షాత్కారం జరిగిన పిమ్మట వారికీ స్వర్గం యొక్క సుందర సుమనోహర దృశ్యాలు సాక్షాత్కరించి
కల్లోల పూరితమైన వారి మనసును ఆనంద భరితం చేశాయి..
ఆ తరువాత పరమాత్మ శివుడు వీరిలోనే దివ్య అవతరణ గావించి దివ్య గీతా జ్ఞానాన్ని సహజ రాజా యోగాన్ని నేర్పిస్తున్నారు
ఐతే ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించే బాధ్యతను మాత్రం శివ శక్తులైన సోదరీ మణులకు అందించారు.... వీరు ప్రజా పిత బ్రహ్మకు నేరుగా సంతానమైనందున
వీరిని బ్రహ్మా కుమారీలుగా వ్యవహరిస్తున్నారు. అలా పరమాత్మా మార్గదర్శకత్వం లో సోదరీ మణుల ప్రత్యక్ష పర్యవేక్షణ లో ఈ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం
'ప్రజా పిత బ్రహ్మా కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంగా విశ్వా విఖ్యాతిని పొందింది.ప్రపంచ వ్యాపితంగా 130 దేశాలలో అనేక వేల శాఖలు కలిగి భారత దేశం లోని రాజస్థాన్ రాష్ట్రం లో అబూ గిరిని తన అంతర్జాతీయ ముఖ్య కేంద్రంగా చేసుకుని అనితర సాధ్యమైన తన సేవలను నిరంతరం నిరంతరాయంగా అందిస్తోంది
......... ..... ... ..... రండి ఈ పావన జీవన స్రవంతి లో మీరూ భాగస్వాములుకండి ...... మీ జీవితాలకు ధాన్యతనూ సార్ధకతనూ చూపించండి .ఓంశాంతి