నేను నిన్ను ప్రేమించడమే నేను చేసిన నేరమా.....
నిన్ను ప్రేమించిన పాపానికీ నాకు ఈ శిక్ష ఎందుకు.....
నువ్వు కూడా ఏవరినీ అయినా నీతితో నిజాయితిగా ప్రేమిస్తే తెలిసేది....ఈ బాధ..
కానీ ఈ బాధ నీకు రాకూడదు....
నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంతో ఉండాలి.....
సుఖంగా ఉండాలి....
తన సాంగత్యంలో తనువు మనసు ఎప్పుడు సంతోషమే..
తన పక్కన ఉంటే ఈ ప్రపంచమే నా పక్కన ఉన్నంత ఆనందం..
అందుకే తనకై ప్రతిక్షణం తపిస్తున్నా తనపేరునే జపిస్తున్నా ..
మాట ఇచ్చి వెళ్ళు ప్రియ...గుర్తుంటానని ..,
చిగురించిన ప్రకృతిని చూసినప్రతిసారి నేను నిన్నిoకా ప్రేమిస్తున్నానని . . . ,
వర్షం కురిసిన ప్రతిసారి అది నా కన్నీరని . . ,
నిను తాకిన వేసవి గాలి నా నిట్టూర్పని . . . ,
నీ మరపు నా ఆఖరి శ్వాస అని . . . ,
గుర్తుంచుకో ....................
చొరవ తీసుకున్న మనసుని అభినందించే ప్రేమని . ,
చనువు పెంచుకొని ఆరాధించే ప్రేమని . ,
క్షణాకాలపు జీవితాన్నీ చావనివ్వని ప్రేమని . ,
ఒంటరి చినుకుల వర్షాన్ని తరిమే ప్రేమని . ,
హృదయపు ఆకాశాల ఎత్తుకు ఎదిగిన ప్రేమని . ,
భూతంలో ఇంకిన కాలపు జ్ఞాపకాన్ని దూరం చెయ్యని ప్రేమని . ,
నువ్వు,నేను జంట రెక్కలై ఊగుతుంటే . . ,
జగాలకు వ్యాపించిన ప్రేమని . . ,
నీకై వేచిన మనసుకై కోరనీ . . . .!