Telugu Quote in Poem by Phanikiran

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ప్రేమ... ఓ అమృతవర్షిణి

ప్రేమంటే

ఏమని  చెప్పాలి

ఎలా తెలపాలి

ప్రేమకు రూపం ఉంటే ...

అది అమ్మగా అగుపించదా .

ప్రేమే బాధ్యత అంటే..

అది నాన్నగా కనిపించదా.

ప్రేమే రక్షణ అయితే ...

తోబుట్టువుగా నీ పక్కన నిలబడదా .

ప్రేమే నిస్వార్ధం అంటే ...

అది స్నేహమై నిను అల్లుకోదా.

ప్రేమే జన్మల బంధమంటే ...

జతగా తోడై నీ దరి చేరదా.

ప్రేమే లేని ప్రపంచం ...

ఊపిరి ఉన్నా జీవచ్ఛవం.

అణువణున నిండినది.

బ్రహ్మాండమంతా ఎదిగినది

అందరిలోనూ ఉన్నది .

అంతర్వాహినిగ మారినది.

నీతోనే, నీలోంచే మొదలైతే...

ఎడతెగక ప్రవహించే జీవనది..

అమృతాన్ని వర్షించే మధుర సుధా గని.

***%%%***

బాగుంటే రేటింగ్ ఇవ్వండి..

నచ్చితే సమీక్ష రాయండి.

ప్రేమతో ♥️

మీ 🤗

ఫణికిరణ్ 🙏

Telugu Poem by Phanikiran : 111943884
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now