అర్థరాత్రి పున్నమి వెన్నెల్లో కురుస్తున్న మెత్తటి మంచు ను చూస్తూ.. హిమాలయాల లలో పహారా కాస్తూన్న ఒక సైనికుని సంభాషణ..
ఓ హిమమ.. ఎప్పుడు ఇక్కడే కురిసే నీకు నీకంటే తెల్లటి మెత్తటి ది ఇంకేమి లేదు అనుకుంటున్నావేమో, కానీ నీకంటే తెల్లటి మెత్తటి పండు వెన్నెల లాంటి బుగ్గల తో అక్కడ నా బంగారం ఉంది...
ఓ హిమమ.. ఎప్పుడు ఇక్కడ కాశ్మీర్ కొండల్లో పారుతున్న నదులను చూసి వీటి కంటే అందమైన ఒంపులు తిరిగినవి ఏమి లేవు అనుకున్నావేమో, కానీ అక్కడ ఎంతో సుగంధాలు పరిమళాలతో పురులు తిరిగి, వయ్యారం గ ఒంపులు తిరిగిన నా బంగారం కురులు ఉన్నాయి
ఓ హిమమ.. ఇక్కడ నీకు కుంకుమపువ్వు (కేసరి) నీ చూస్తూ చూస్తూ ఇంతకంటే ఎర్రగా ఇంకేం లేదనుకున్నావేమో , కానీ అక్కడ మందారాలు కూడా సిగ్గు పడేలా తుమ్మెదలు సైతం మధం ఎక్కేల నా బంగారం పెదాలు అగుపిస్తాయి..
ఓ హిమమ.. ఇక్కడ నల్లటి దేవదారు చెట్ల లో నుంచి వెండి మంచు కురుస్తున్న తొంగి తొంగి చూస్తున్న వెండి జాబిల్లి కాంతులు చూసి ఇంతకంటే అద్భుతం ఇంకోటి ఉండదేమో అని మాత్రం అనుకోకు.. అక్కడ పరమేశ్వరుని కంఠం వోలె.. పార్వతి దేవి కురుల చివర ఉన్న వెలుతురు వోలె నల్లటి కనుబొమ్మల మధ్య లో సముద్రు డి నీలాన్ని మొత్తం తన కనుల లో దాచుకుని, సముద్రం లో దూకిన బయటకి రావచ్చు ఆ కనుల చూపులు. చూసినప్పుడు ఎప్పటికీ బయటకి పడలేమేమో అనెట్టుగా నా బంగారం నీలి కనులు నీకు కనిపిస్తాయి..
ఇలా ఒంటరి గ పహారా కాస్తున్న ఒక యువ సైనికుడు తన ప్రేయసి గురించి తన తో పాటు నిదుర మేల్కొని కురుస్తూ కురుస్తూ ఉన్న మంచు తో పంచుకుటున్నాడు..
మీ మాధవ్