శుభోదయం....,
i can't breath in that time......
ఆ చీకటిలో
నా ఊపిరికి ప్రాణం పోసింది నీ ఊపిరి......
పెరుగుతున్న నీ బరువుతో ఊపిరాడకున్నా
ఆనందముగా మోసిన ఆ రోజులు మరువలేను
నువ్వు బయట ప్రపంచాన్ని (వెలుగు) చూసేందుకు లోపల కనిపించని శక్తి (చీకటి) తో పోరాడుతుంటే.....
ఈ నొప్పి ని ఓరచుకోలేనెమో ప్రాణం పోతుందెమో అని లోలోపల అనిపించినా....
నీకీ ప్రపంచాన్ని (వెలుగు) చూపించడానికి గుక్క బట్టి శక్తి కూడగట్టి కంటిపాప చివరంచుల్లో నుండి కన్నీరు విడుస్తూ (చీకటిని) ఆరాటపడిన ఆ క్షణం......
నిశీధి నిశ్శబ్దంలో నీ శబ్దం
నా ఊపిరికి ఊపిరై నిలిచింది.....
K O M A L I....✍️