English Quote in Thought by Bk swan and lotus translators

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం... అని ఘనంగా చాటుకునే మన దేశంలో క్రమంగా ఇవన్నీ కనుమరుగౌతున్నాయన్నది కఠోర వాస్తవం.. విష వాయువులు పీల్చలేక దేశ రాజధాని పౌరులు ఇప్పటికీ నరకం అనుభవిస్తున్న విషయం విదితమే.. ఇదిలా ఉండగానే దేశంలో అరవై కోట్లకు పైగా ప్రజానీకం నీళ్ళ కరువుతో సతమవుతున్నారనే పిడుగులాంటి విషయాన్ని వెల్లడించింది.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే2020 నాటికి ఢిల్లీ,చెన్నైలాంటి నగరాల్లో 2030నాటికి పూర్తి దేశంలో కరువు విలయతాండవం చేయటం తధ్యమని హెచ్చరించింది‌‌‌ కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్.... ఒకప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే మంచినీళ్ళుతాగుతారా అని అడిగావారు.. ఎవరైనా ధనాన్ని వృధా చేస్తుంటే డబ్బు నీళ్ళలా ఖర్చు చేస్తున్నారు అనేవారు.. ఇప్పుడు ఈ మాటలనాంటే అనేకసార్లు ఆలోచించవలసి వస్తోంది.. దేశంలో నీటి కరువు ఈ స్థాయిలో ఉంది లక్షల కోట్ల ధనాన్ని వ్యయంచేసి చందమామలో నీళ్ళు వెతికే శాస్త్రవేత్తలు తాము" నేల విడిచి సాము చేయట్లేదు"కదాఅని ఆత్మపరిశీలన చేసుకోవాలి ఇదిలా ఉండగా ఇటువంటి పరిస్థితులలో నీటిని వృధా చేసినందుకుగాను భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కొహ్లీకి ఐదువందల రూపాయల 'భారీ'జరిమానా విధించినట్టు తెలుస్తోంది. నిజానికి అతను తాగే నీళ్ళ సీసా ఖరీదే అంతకన్నా ఎక్కువ
మరి అధికారులూ పాలకులూ ఇటువంటి 'కఠిన క్రమ శిక్షణా చర్యల'తో ప్రజలకిచ్చే సందేశం ఏమిటో వారికే తెలియాలి.. ఇకనైనా ఇటువంటి హాస్యాస్పద చర్యలకు స్వస్థి చెప్పి శాస్వత పరిష్కార చర్యలకు ఉపక్రమించాలని ప్రజలు కోరుతున్నారు లేదంటే ఇప్పుడు పాడుకుంటున్న వందేమాతరం గీతానికి బదులుగా "వందేమాతర గీతం వరుస మారుతున్నది ..సరళి మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది అని వందేమాతరం శ్రీనివాసరావుగారు గానం చేసిన ఆ గీతాన్ని పాడుకోవలసి ఉంటుంది

English Thought by Bk swan and lotus translators : 111207405
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now