చెరకుగడలనుదెచ్చి కుదురు పందిరివేసి
కాకరను పాకించి సాకవచ్చు
కాని అందున్నట్టి చేదుపోదుగదయ్య
ఖలుని మదిలోనున్న విషమువోలె
చెరుకుగడలతో పందిరి చేసి కాకర తీగను పాకించి పెంచవచ్చు..కానీ దాని చేదు పోదు
అలాగే...చెడ్డవాని మనసులో ఉండే చెడుకూడా అంత సులభంగా పోదు అని భావం....ఓంశాంతి