చుక్కలన్నీ కలసి నీదు చెక్కిలి తాకి
పులకించ రాలేను పుడమి పైకి
అవి తాకి నీ చెంప కందిపోవునేమొ
కాలమే చేసెనీ ఇంద్రజాలం
నీవు కాలు మోప నా చేయి చాచనూ
కందునని మనసునే పరచినాను
కాని ఈ కళ్ళలో కన్నీరు ఏలనో
కాలమే చేసెనీ ఇంద్రజాలం
చెవుల పిల్లివోలె చూసేవు చెలి నీవు
నేల జాబిలివోలె నవ్వుతావు
లేడిలా గెంతేవు నెమలిలా ఆడేవు
కాలమే చేసెనీ ఇంద్రజాలం
గుండె గొంతుక లోన ప్రేమ పాటై మోగె
కవితలై పుటల పై పొంగి పొరలే
అనురాగ రాగాన ఆలపించెద నేడు
కాలమే చేసెనీ ఇంద్రజాలం