తరువులోనపుట్టి పరశుజతగా మార
ఆ కట్టె చెట్టుకే చేటు తెచ్చు
సాంగత్య దోషమిది స్వయము రక్షించుకొన
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు
వృక్షంలో పుట్టినప్పటికీ గొడ్డలితో జట్టుకడితే ఆ కట్టె
ఆ చెట్టుకు చేటు చేస్తుంది.. అలాగే సమాజంలో పుట్టిన వ్యక్తి చెడ్డవారి సాంగత్యంలో చేరితే సమాజానికే చెడు చేస్తాడు.. ఇదంతా సాంగత్య దోష ప్రభావం దీని నుండి స్వయాన్ని రక్షించుకోవడానికి ఓ బ్రహ్మ పుత్రా తక్షణమే మేలుకో
ఓంశాంతి...