అగ్గి జ్వాలలందు చెత్త బుగ్గిజేసి
ఇళ్ళు శుభ్రముజేయు క్రతువు భోగి
అట్లె యోగాగ్నిలో స్వచ్ఛమగును మనసు
అన్న నిక్కమెరుగువాడె యోగి
పనికిరాని వస్తువులను మంటల్లో పడేసి కాల్చి బూడిద చేసి ఇళ్ళను శుభ్రం చేసుకునే యజ్ఞమే భోగి..అలాగే మనసును స్వచ్ఛం చేసేది యోగాగ్ని అనే నిజం తెలుసుకున్న వాడే అసలైన యోగి అని అర్ధము...
............అందరికీ భోగి శుభాకాంక్షలు...ఓంశాంతి