కళ్ళజోడు నెత్తికెక్కితే ప్రమోదం
కళ్ళు నెత్తికెక్కితే ప్రమాదం
నీటిలో పడవ ప్రయాణం ప్రమోదం
పడవలోకి నీళ్ళ ప్రయాణం ప్రమాదం
సమస్యలతో చెలగాటం కొందరికి ప్రమోదం
జీవితమే సమస్యైతే ఎవరికైనా ప్రమాదం
గాలిలో గువ్వలా చెలరేగటం ప్రమోదం
పట్టు తప్పి పడ్డామా ప్రమాదం..పెను ప్రమాదం
నేల అదిరేలా కాళ్ళు కదిల్చి నృత్యం చేయడం ప్రమోదం
నేల అదిరి ఇళ్ళే అదిరితే ప్రమాదం
నవ్వుల పాలు పొంగితే ప్రమోదం
నవ్వులపాలైతే ప్రమాదం
శీతల పానీయాలు త్రాగడం ప్రమోదం
అతిగా తాగితే ప్రమాదం
అభినేతలను అనుకరించటం అభిమానులకు ప్రమోదం
అసలు ఉనికినే కోల్పోతే అత్యంత ప్రమాదం
కొన్న బంగారం ధర పెరగితే ప్రమోదం
కొనే బంగారం ధర పెరిగితే ప్రమాదం
ఇల్లు పిల్లా పాపలు పెరిగితే ప్రమోదం
ఒకరు తగ్గి ఒకరు పెరిగితే ప్రమాదం
ఆత్మీయ భావన తో ప్రేమిస్తే సర్వదా ప్రమోదం
దైహిక ఆకర్షణే ప్రేమని భ్రమిస్తే సర్వత్రా ప్రమాదం