* నిజం - కొన్ని నిజాలు నిరంతరం మరణిస్తూనే ఉంటాయి జీవితం మోయాలే తప్ప నిరూపణ సాధ్యపడదు.
* సమస్య - సమస్యని మన నుండి దూరం చూసుకోవడానికి సమస్య నుండి మనం దూరమవడానికి మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించిన సమస్య సమసినట్లానని గ్రహించు.
* మౌనం - మౌనం కొన్ని సందర్భాలలో మేలు చేకూర్చును మరికొన్ని సందర్భాలలో కీడు మిగుల్చును సందర్భానుసారంగా ప్రవర్తించుట ముఖ్యం.
* ఆప్యాయత - అసూయ - ఆప్యాయత అమృతాన్ని పంచితే అసూయ విషాన్ని చిమ్ముతుంది అసూయ ఆప్యాయతకు చేరువవుట బహు కష్టం కాని ఆప్యాయత తప్పక అసూయని చవి చూస్తుంది.
* అభినందన - అవమానించిన వారే అభినందించాలనుకోవడం తప్పు కాదు, ఆ ప్రయత్నంలో నిన్ను నీవు కోల్పోవడం మాత్రం తప్పు.
* అవరోధం - నడవాల్సినపుడు పరుగుపరిగేత్తాల్సినపుడు నడకరేండూ గమ్యాన్ని చేరుటకు అవరోధాలు.