యువతరం
ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.
యువతరం జీవితమంతా online వశం
అదే వారి కైలాసం.
అదే వారి పరవశం.
బొందితో కైలాసం ఆనాటి మాట.
బొందు లాగు మన యువతకి వరాల మూట.
కరోనా పుణ్యమా అని work from హో మ్.
సూటు బూటు మడత పెట్టి చేర్చారు రూమ్.
టేబుల్ మీది వెంకన్న బాబు బొమ్మ చేరింది గూట్లో.
Laptop లో దర్శన మిచ్చింది తన హీరో బొమ్మ
వాల్ పేపర్ గా.
గళ్ళ బనీను, బొందు లాగు, ఇయర్ ఫోన్స్,
లాప్ టాప్, సెల్ ఫోన్ ,ఇదే మన వాడి అవతారం.
ప్రపంచం తో సంబంధం లేని అంతర్జాల ఉద్యోగం.
చిన్న పెద్ద తేడా తెలియక అమ్మ ,నాన్నఅయోమయం.
ఎప్పుడు నెట్లో మీటింగులు బ్రౌజింగ్లు సెర్చింగ్ లు
నట్టింట్లో ఏమి జరుగుతుందో తెలియని యువకులు.
టొమాటో బాత్ కావాలంటే jomato మీట.
కాఫీ కి మీట ,టీ కి మీట అన్నానికి మీట
కూరకి మీట అందానికి మీట అంతా మీటలే
నోట మాటే లేదు. పీటల మాటే అసలేలేదు.
కుర్చీ కదలక్కరలేదు. అమ్మాయికి అలుపు లేదు.
ప్రయాణం అంటే చటుక్కున make my trip
బస కావాలన్న బస్సు కావాలన్నా online లోనే.
అడ్వాన్స్ బుకింగ్ , online confirmationlu.
కోట్ల రూపాయల వ్యాపారం గాల్లోనే.
బుకింగ్ లన్నీ రేటింగ్ ల మీదే.
మన సౌకర్యాలన్ని గాల్లో పెట్టిన దీపం.
మనకు కనపడని జవాబుదారీతనం.
అమ్మ వంటింటి సామానులు
అమ్మమ్మ మందులు
ఇంటి సామానులు వరకు అమెజాన్ booking లే.
అన్నీ గదులు flipkart packing ల మయం.
ఏవి రిటర్న్ ప్యాకెట్లు,
ఏవి విప్ప వలసిన ప్యాకెట్లో
తెలియక అంతా గందరోళం.
అమెజాన్ వారి అబ్బాయిలు రోజు వారి చుట్టాలే.
గేట్ దాటి లోపలకు రాని చుట్టం
మంచి నీళ్లు కూడా ముట్టని మహా త్యాగం.
On-line purchselu అన్నీ డిస్కౌంట్ల మయం.
అదే మనందరి బలం బలహీనత
పాకెట్ విప్పితే గాని బయట పడని బండారం.
On-line బొమ్మల్లో అంత colour full.
తీరా ప్యాకెట్ విప్పితే మన కళ్ళల్లో నీళ్ళు.
లాటరీ తగిలితే డిస్కౌంట్ మేలే.
షో రూం లో సరుకు సెలక్టింగ్ లు.
On-line లో purchasing లు.
అన్నీ క్రెడిట్ కార్డ్ ల స్వైపింగ్ లు
నెలాఖరులో బిల్లుల స్టేట్మెంట్లు
మినిమం ఎమౌంట్ పేమెంట్లు.
పైన పటారం లోన లోటారం.
కుర్చీలు కదలక్కరలేదు కోడింగ్ డీకోడింగ్
అంతా మీటల మీదే.అంతా యంత్ర మయం.
మంత్రాలు తంత్రాలు అసలు లేనే లేవు.
కళ్ళ కి జోడు. కాయం ఊబ కాయం
Online యువతకి ఇచ్చిన అలంకారాలు.
తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు.
ఏమి చేస్తాం యువత కి లేదు మరో గమ్యం గమనం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ
9491792279