నేనొక నిష్కల్మషమైన కమలాన్ని
శరీరమనే సముద్రాన తేలియాడే
సహస్ర దళ పద్మాన్ని
జ్ణాన సూర్యుని అనంత
శక్తుల కిరణాల్ని ఆహారంగా
గ్రహించి... ఆత్మిక సుగంధాన్నే
ప్రసరించే ఆత్మ కుసుమాన్ని...
సహస్రారాన్నీ, ఆజ్ణా చక్రాన్నీ,
అనాహతాన్నీ, మణిపూరకాన్నీ
స్వాధిష్ఠానాన్నీ,మూలాధారాన్నీ
శాశించే అధికారాన్ని
వేల వేల జీవనాడులను
సమన్వయ పరిచే
ఇడ, పింగళ, సుషుమ్న నాడులను
నడిపించే అధినాయకత్వాన్ని
పరమ పిత పరమాత్మకు ప్రియ సంతానాన్ని
వారి అణ్వేషనలో దిక్కు తెలియక అలమటించే యోగ యాత్రికులకు దారి చూపే కరదీపాన్ని
నేను కంటికి కనిపించని కాంతి కేంద్రాన్ని
అందరూ ఇంతే అని ప్రజాపిత చాటి చెప్పిన తిరుగులేని సత్యానికి ప్రత్యక్ష్ష్య సాక్ష్యాన్ని...
Poet-
Bk sai syam manohar,
satyanarayanapuram, Vijayawada
BKSSM