పాత సంఘటన ఒకటి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.
ప్రతి రోజూ లాగే ఆ రోజు కూడా ఆఫీసు కు బయల్డెరాను. ఆఫీసు కు వేల్తానే అందరికి విష్ చేసి నా సీట్లో నేను కూర్చుని పని చేస్తున్నాను. మా కొలీగ్ వచ్చి నీకీ విషయం తెలుసా, మన దగ్గర పని చేస్తున్నా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందట మనము కూడా స్పాట్ కి పోదాం తొందరగా బయలు దేరు, వెహికిల్ రెడీ గా ఉంది అని నన్ను కూడా స్పాట్ కి తీసుకెళ్ళింది. అపుడు నాకు తేలీదు, ఈ సంఘటన నా జీవితంలో మార్చి పోలేనిది అవుతుందని.
యాక్సిడెంట్ సంఘటన స్థలం లో అతని తల లారీ ఎడమ వైపు వెనుక చక్రం కింద ఉంది, కాలు కుడి వైపు వెనుక చక్రం కింద ఉంది. లారీ ఆ సంఘటన జరిగిన వ్యక్తి ని పది అడుగుల దూరం లాక్కెళ్ళింది. అతని మెదడు రోడ్డు కి అతుక్కుని ఉంది.
నేను ఉద్యోగరీత్యా వేరే ఊరిలో ఒక్కదాన్నే రూమ్ తీసుకుని ఉంటున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంటిలో నైట్ ఒక్కదాన్నే వుండాలంటే ఎదో తెలియని భయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. పడుకొని కళ్ళు మూస్తె ఇప్పటి దాకా జరిగిన చావు సంఘటన లు అన్ని ఒకసారి కళ్ళ ముందర ప్రొజెక్టర్ ఆన్ చేసి సినిమా ను స్క్రీన్ మీద చూసినట్లు అనిపిస్తుంది. ఈ సంఘటన జరిగి ఇప్పటికి 13 సంవత్సరాలు అవుతున్నా నా సమస్య కి పరిష్కారం దొరకలేదు.