రేయి వేళ విచ్చు కొలను కలువపూలు
పగలు వికసించుగా పంకజాలు
సూర్యుడున్న వైపు తిరిగేను సూర్యముఖి
కుసుమాలు నేర్పేటి నేర్పు ఇదియే
కొలనులోని కలువలు రాత్రి వికసిస్తాయి
కమలాలు పగలు విచ్చుకుంటాయి
ఇక పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడు ఎటుంటే అటుతిరుగుతుంది.. ఈ పుష్పాలన్నీ వికాసవంతమైన జీవితాన్ని నేర్పుగా ఎలా గడపాలనే జ్ఞానాన్ని ఇలా నేర్పుతున్నాయి..ఓంశాంతి