కుండ
మట్టిలో పుట్టిన మాణిక్యం 
నరుడికి వేసవి తాపం తీర్చే అమృతభాండం
రంగు నల్ల బంగారం 
గుండె  శీతలయంత్రం 
తామరాకు మీద నీటి బొట్టు లాంటి జీవితం 
చెయ్యి జారితే ముక్కలయ్యే  కుంభం 
సప్తస్వరములు  పలికిస్తే అది ఘటం 
నోరూరించే ఊరగాయకి  అదే ఆధారం
సాదరంగా ఆహ్వానించేది పూర్ణకుంభం 
కడవరకు సాగనంపే ఆత్మీయ భాండం 
జోరుగా కురిసే వర్షం కుండ పోత 
మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే 
వట్టి మట్టి పూత.
కాకి బావకు దాహం తీర్చే
సన్న మూతి కూజా
వేసవి వచ్చిందంటే
గొంతును చల్లబరిచే తర్బూజ. 
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279