దేశ గణములనన్ని సక్రమముగా నడుపు
సరియయిన తంత్రమే రాజ్యాంగమూ
అట్లె మనలను నడుపు యంత్రమే మనసనుచు
ఎరిగి బుద్ధినిగల్గి మెల్గుమెపుడూ
మన దేశాన్ని సరైన మార్గంలో పురోగమింపచేసే యంత్రాంగమే రాజ్యాంగం.. అలాగే మన నడవడికను నిర్దేశించే సూక్ష్మాంగమే మనసని తెలుసుకుని తెలివిగా మసలుకోవాలి...ఓంశాంతి