మహిళ మనసన్నదొక మధుర చెక్కెరకేళి
ఆగ్రహించినదంటె భద్రకాళి
గేలి చేసితివంటె ధూళిలో కలిసేవు
వారి జాలిని అలుసు చేయబోకూ
మహిళల మనసు చెక్కెర కేళిలా మధురమైనది... ఆగ్రహం వస్తే మాత్రం భద్ర కాళువవుతారు... వారికున్న జాలి గుణాన్ని అలుసుగా తీసుకోవద్దని భావం...ఓంశాంతి