బంధం
మనం బావున్నప్పుడు అందరూ బ్రహ్మాండంగా మాట్లాడతారు,
అదే బాధల్లో ఉంటే మాట్లాడటమే దండగ అనుకుంటారు.
ఇష్టం గా ఉంటే కాకమ్మ కబుర్లు చెప్తారు,
కష్టం వస్తే కంటికి కూడా కనిపించరు.
బంధాలు పైకి బలంగా ఉంటూనే,
బలహీన పరిస్థితుల్లో భారంగా మారిపోతాయి.
స్నేహితులు, సన్నిహితులు అందరూ చుట్టాలే,
కానీ నష్టాల్లో, నలుగురూ ఒంటరిని చేసేవారే..
కఠినం అయినా, కష్టం అయినా నీకు తోడు ఉండేది..
ఇష్టమైనా, ఇబ్బంది అయినా వెన్నంటే నీడగా ఉండేది..
నీ రక్త సంబంధం అదే కుటుంబం..
చితి వరకు అంతులేని అనుబంధం...