గమ్యం
ప్రేమ అనేది ఒక మాయ.
కళ్ల ముందు కనిపిస్తూనే కరిగిపోతుంది.
కలకలం ఉంటుంది అనుకుంటే కన్నీళ్ళనే మిగిలిస్తుంది.
కలలా మరిచిపో, అలలా దాన్ని చెరిపెసేయ్,
నీ మర్పే నిన్ను ముందుకి తీసుకుపోతుంది,
నీ గమ్యాన్ని నీకు గుర్తుచేస్తుంది,
నీకు నువ్వే తోడు, నీ ధైర్యమే నీకు ఓదార్పు.
జీవితంలో జరిగే ప్రతీదీ నీకు ఒక తీపి జ్ఞాపకం.
నేర్చుకుంటే అదే జీవితకాల గుణపాఠం.