ప్రియమైన నీకు, "ఎలా ఉన్నావు?", "ఏం చేస్తున్నావు?", "లైఫ్ ఎలా ఉంది?" చాలా ప్రశ్నలు... అడగడానికి ధైర్యం సరిపోవట్లేదు నువ్వు తిరిగి నన్ను అదే ప్రశ్నలు అడుగుతే, సమాధానం లేదు.. నువ్వు నేను ప్రశ్న అడిగాక, నన్ను తిరిగి అడగకపోతే.. తట్టుకొనే శక్తి లేదు నన్ను ఇంకెప్పుడు మాట్లాడనివ్వకుండా బ్లాక్ చేస్తే.. ఏం చేయాలో తెలీదు
మనం ఎప్పుడూ ఫ్రెండ్స్ కాదు... స్ట్రేంజర్స్ గానే ఉన్నాం కథ.. ఒకప్పటి నీకు .. నేను తెలీదు ఇప్పటి నాకు... నువ్వు తెలీదు ఆశ్చర్యంగా ఉంది కదా.. ఒకరికి ఒకరం ఎంత పరిచయస్తులమో.. అంతే అపరిచితులం.. మన కథ.. ఎలా మొదలైందో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను.. మరి ఎలా ముగిసిపోయిందో చెప్పడానికి నువ్వు సిద్ధమా?
నువ్వు చూసిన అందం .. బాధ్యతల బరువుకు ముక్కలయిపోయింది నేను కోరుకున్న బంధం.. నీ ఆలోచనల అగ్నిలో కాలిపోయింది... గతం, మన చిరునామా.. అదే చిరునామాకు రాస్తున్న ఈ లేఖ...
ఇంకో అవకాశం ఉంటే... ప్రతి తప్పటడుగు కలిసి దిద్దుకుందామా?
ప్రియమైన 16ఏళ్ల ఐశ్వర్యకి 26ఏళ్ల నీ భవిష్యత్తు రాస్తున్న విన్నపం.. చదివి బదులిస్తావా? దయీంచి మణిస్తావా?