నా ఇంట్లో ఎప్పుడు ఖాళీగా ఉండే రెండో గది చంటి పిల్ల గది.
ముద్దుగా నామకరణం పురిటి గది .
అదో మిలిటరీ క్యాంపస్
దాటాలంటే కావాలి మనకు పాస్.
అందాల అరడుగుల మంచం.
తెల్లటి ప్రత్యేకమైన పక్క
చుట్టు దోమల కంచె
గోద్రెజ్ వారి శీతల యంత్రం.
ప్రక్కనే సహయకురాలి మంచం
సాంబ్రాణి పొగ వాసన
పురిటి గది ప్రత్యేక అలంకారo.
అదే చంటి పిల్లకు ఆరోగ్యకరం.
చంటి దాని తాళం లేని రాగం తో గదంతా సందడి.
ఏడుపు ఎందుకో అని మనకి అలజడి.
ప్రక్క వీధి డాక్టర్ కోసం సెల్ఫోన్ కాలింగ్.
తమలపాకు కోసం ఫ్రిడ్జ్ చెకింగ్
మా పిల్ల అంతర్జాలం లో సెర్చింగ్.
కానీ పిల్ల ఏడుపు అమ్మ పాల కోసం.
అది తెలిసిన చెప్పకుండా తాతమ్మ దరహాసం.
ఇ దే ప్రతిరోజూ మా జంటల అనుభవం.
ప్రతీ రోజు టైం ప్రకారం స్నానo
లెక్కల ప్రకారం ఫీడింగ్ ఇవ్వడo.
అదే మన కుటుంబ అనువంశికo.
మా చుక్కకి ప్రతిరోజూ బుగ్గన చుక్క.
అదే ఆమె అందానికి మచ్చు తునక.
ప్రతిరోజూ కలర్ఫుల్ డ్రెస్సింగ్
కొత్త మోడల్ కోసం అమెజాన్ బుకింగ్.
సాయంత్రం తాతమ్మ బాడీ మసాజ్
కాళ్ళు చేతులు ఆడిస్తూ పిల్ల కసరత్.
ఉదయం సాయంత్రం పాప తో కాలక్షేపం.
అదే తాత జన్మకి సార్ధకం.
తాత వడి పిల్లకు క్షేమకరం.
ఆ అందాల అనుభవాలు గది స్వoతం.
అదే తాతకి కూడా అంతులేని ఆనందం.
చంటి పిల్ల పదిమంది పెట్టు
ఆ పిల్ల ఎక్కింది తాత గారి మెట్టు.
అదే తాతగారి ఆనందానికి కారణం
మనసంతా మర్చిపోలేని అనుభవం.
ఆ అందాల రాణి సోఫా ఎక్కి కూర్చుంది.
నా గది లో చందనపు బొమ్మ మంచం ఎక్కింది..
చందనపు బొమ్మ తో ఆటలాడుకోగలం.
కానీ ముద్దాడలేము.
నా గదంతా నిశ్శబ్దం అవహించింది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ
9491792279