మచ్చ
ఓ క్షణికావేశం
నాలుగు గోడల మధ్య బందీ చేసింది
తుపాకీ మో తలు ,ఖాఖీ బట్టలు
ఇనప బూట్ల చప్పుళ్ళు
స్వేచ్ఛ జీవితం కోసం ఎదురు చూపులు
ఇదే నా చుట్టూ ఉండే ప్రపంచం.
అయిన వాళ్లకు దూరంగా
ములాకత్ లో పలకరింపులు
చిన్న చిరునవ్వుల వెనక
చూపుల ,మాటల పోరాటం.
కన్నీళ్ళలో ప్రేమ,
ఆశలో వేచి ఉండే భవిష్యత్తు
ఇది నా దౌర్భాగ్యం.
స్వేచ్ఛ కోసం నా ఎదురు చూపుల లెక్కలన్నీ
ఇనుప చువ్వలకే తెలుసు.
కాలవలు కట్టిన నా గుండెలోని బాధ
ఆ రాతి గోడలకే తెలుసు.
ఉప్పొంగే రక్తంతో అడుగుపెట్టిన నేను
జీవితకాలం అంతా గడిపి
సర్కారు వారు క్లీన్ చిట్ ఇస్తే
ఆ గడప దాటిన నేను
సమాజం నాకేసి చూసిన ఆ చూపు
గుండెల్లో ఏదో ఒక గుచ్చుతూనే ఉంది.
ఆ మరక నన్ను వెక్కిరిస్తూనే ఉంది.
గర్భస్థ నరకం నుండి విడుదలై
మళ్లీ ఇనప చివ్వలకు బందీనై
స్వేచ్ఛ జీవినైనా
సమాజపు గోడలు తెరుచుకునేది ఎప్పటికో
రచన. మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279