కలంలో సిరా నిండుకుంది
క్షమించండి...అమృతం నింపిరాస్తున్నాను
ద్వేషించడమంటే ఏవగింపు కలిగింది
మన్నించండి..నేనందరినీ ప్రేమిస్తున్నాను
అహంకారం పై మమకారం తొలిగింది
దయతలచి స్వీకరించండి అందరికీ నమస్కరిస్తున్నాను
వంచన కంచంలో విందారగించలేను
అర్ధం చేసుకోండి.. నేను మానసిక ఉపవాసం చేస్తున్నాను
పరధ్యానం పై ఆసక్తి పోయింది
అన్యధా భావించకండి నేను పరమాత్మ ధ్యానంలో ఉన్నాను
వికారాల పై వైరాగ్యంకలిగింది
అలాగని వెలి వేయకండి నేను రాజయోగిగా మారాను..
ప్రేమ సాగరుని లో మునిగి జ్ఞాన రత్నాలు మీకై తెస్తున్నాను..మీకోసమే రాస్తున్నాను