Telugu Quote in Blog by Bk swan and lotus translators

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ఓం శాంతి మానవ సేవే మాధవ సేవ అని పెద్దలన్నారు . ఈ సిధ్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా నమ్మి తమదైన రీతుల్లో పరిధుల్లో సమాజానికి సేవలందిస్తున్న వారెందరో ఉన్నారు . నిజంగా వారంతా ధన్య జీవులు ... వారికి జయం కలుగుగాక! వాస్తవానికి మనకు మనుష్య జన్మ లభించింది,ఇతరులకు సేవ చేయడం కోసమే .
"పరోపకారార్థమిదం శరీరం" "పరోపకారాయ పుణ్యాయ పాపాయ పర పీడనం" అనే సూక్తులు తరచుగా మనం వింటూనే ఉంటాం " పరులకు ఉపకారం చేయడం కోసమే మనకు ఈ శరీరం లభించింది " పరులకు ఉపకారం చేయడమే పుణ్యం పరులను పీడించడమే పాపం " అని పై వాక్యాల అర్ధం . ఇదే అర్ధ వంతంగా జీవితాన్ని జీవించడం . ఈ భావన లేకుండా బ్రతకడం అర్ధ రహితం, అనర్ధ దాయకం . "నేనే చేయాలా?" "నాకే ఎందుకు పట్టింది?" అనే సంకుచిత దృక్ఫథాన్ని మనమంతా విడనాడాలి . అప్పుడే నానాటికీ దిగజారుతున్న మానవ సమాజం తిరిగి మెరుగు పడేది.

మరి మరో మనిషికి చేయగలిగే మహోన్నత సేవ ఏమిటి?అంటే మానవుని మాధవునిగా మార్చటమే అని చెప్పాలి వర్తమాన సమయంలో ఈ మహోన్నత సేవ చేయడం ఎలాగో స్వయంగా మనకు నేర్పిస్తున్నారు వారు అందుకోసమే ఈ ఈశ్వరీయ విశ్వ విద్యాలయాన్ని స్థాపించారు .

వారే గవ్వలుగా విలువ హీనమై పడివున్న మన జీవితాలను వజ్రాల సమానంగా తీర్చి దిద్దుతున్నారు . పనికి రాని విషయాలనే రాళ్లను మింగే పావురాళ్ళ వంటి మన బుధ్ధులను జ్ఞాన రత్నాలనూ ముత్యాలనూ స్వీకరించే పరమ హంస బుద్ధిగా చేస్తున్నారు. రాముని పాద స్పర్శ తాకి రాయిగా పడివున్న అహల్య మనిషిగా మారిందట అలాగేమనకు అత్యంత ప్రియాతి ప్రియమైన పరమాత్మ కూడా రాతిలా అచేతనంగా పడివున్న మన బుద్ధికి తన ఆత్మీయ స్పర్శ ద్వారా చేతనత్వాన్ని దివ్యత్వాన్నీ కలిగిస్తారు. ఆనాడు మార్కండేయుని యముని పాశం నుంచి కాపాడినట్లే నేడు మనల్ని మృత్యు భయం నుంచి రక్షించి అమరత్వ పదవిని కటాక్షిస్తున్నారు . చరిత్ర లో చాణిక్యుడు చంద్ర గుప్తుని చక్రవర్తిగా చేసినట్టు వర్తమానంలో శివ పరమాత్మ ప్రజా పిత బ్రహ్మ తనువులో అవతరించి మనను భావి దేవీ దేవతలుగా చేస్తున్నారు...
ప్రేమ సాగరులైన వారు ఆత్మీయత నిండిన అమృత హృదయం తో " మధురమైన పిల్లలూ" అంటూ మనలని ఆహ్వానిస్తున్నారు... రండి.
ఆకాశం వైపు ఆశగా చూడడం ఆపి ఈ అవకాశాన్ని అందుకోండి .. సఫలతా సీతారలై ప్రకాశించండి

Telugu Blog by Bk swan and lotus translators : 111970350
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now