Telugu Quote in Poem by Yamini

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ఉషోదయపు కిరణాలు తనువును తాకగా, నవోదయపు ఆశలు మదిలో చిగురించగా,
వాటి కోసం ఈరోజు ప్రయత్నం ఆరంభించు !

క్షణాలు గడిచే కొద్దీ ఎండ వేధిస్తున్నా,
కష్టాలు గుండెను బాధిస్తున్నా,
మొదలెట్టిన పనిని ఈరోజంతా కొనసాగించు !
నిన్నటి తప్పులను సరిదిద్దుకొంటూ,
రేపటి లక్ష్యం కోసం పోరాడుతూ,
చేరే గమ్యానికి ఈరోజు బాటలు పరుచు !

సమస్యలు మన మెదడును చుట్టుముట్టినా, చిగురించిన ఆశలన్నీ ఆవిరవుతున్నా,
ఈరోజు గెలుపు కోసమే శ్రమించు !

నింగిలో చీకట్లు కమ్ముకొంటున్నా,
చల్లని వెన్నెలలో చేసిన శ్రమను తలచుకొంటూ, రాబోయే విజయాన్ని ఈరోజు ఆస్వాదించు !

Telugu Poem by Yamini : 111951598
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now