అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బార్బీ బొమ్మల తయారీ సంస్ద ఆ బొమ్మను తయారుచేసి 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రముఖ భారత యువ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి దీపాకర్మార్కర్ గారిని తనదైన శైలిలో ఘనంగా గౌరవించింది...అరవయ్యవ వార్షికోత్సవం సందర్భంగా దీపా కర్మర్కర్ను పోలిన బొమ్మను తయారుచేసి అమెను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసంది
దీనిపై ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ " బార్బీ ఎప్పుడూ అమ్మాయిలు ఏదైనా సాధించగలరని నిరూపించింది... రేపటి తరం అమ్మాయిలకు ప్రేరణ ఇచ్చే రోల్మోడల్గా బార్బీ ఎంచుకోవడాన్ని తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు