అన్నీ తెలుసుకోండి
మంచిని నేర్చుకోండి
ముందు పరిశీలించండి
పరిపరి విధాల పరికించండి
అందుకై ఆలోచించండి
ఆ తరువాతే నిర్ణయించండి
సమయం విలువ గుర్తించండి
సంయమనం పాటించండి
ఉమంగాన్ని ఉంచుకోండి
ఉత్సాహంగా ఉండండి
ప్రతీ శ్వాసనూ ఆశతో నింపండి
నిరాశకు నిశ్వాసతో వీడ్కోలు పలకండి
కాలం ఎవరికోసం ఆగదండి
దిక్కులు చూస్తూ ఎక్కడా ఆగిపోకండి
చురుకుగా వుండండి
దుడుకుతనం తగ్గించుకోండి
ఆత్మవిశ్వాసంతో తలెత్తుకు జీవించండి
అతివిశ్వాసంతో తలెగరేయకండి
వినయంగా ఒదిగివుండండి
విమర్శలకు కుంగకండి... ముఖస్తుతికి పొంగిపోకండి
ఇలా మీరు చేసి చూడండి
విజయాలన్నీ మీవే నన్ను నమ్మండి