English Quote in Shayri by Bk swan and lotus translators

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

నేనే చతుర్భుజ విష్ణు స్వరూపము
కావాలి నీవునూ నా సమానము
నీవు తెలుసుకుంటే నా స్వరూప అంతరార్ధము
కాగలవు నీవునూ నా ప్రతిరూపము
తెలుసుకో..మానవత్వమే మాధవత్వము
నేర్చుకో..ధాతృత్వమే ధీరత్వము
స్వ చింతనము..స్వ స్వరూప సందర్శనము
దీనికి చిహ్నమే సుదర్శన చక్రము
పవిత్రతయే సదా సుఖ శాంతులకు మూలము
దీనికి చిహ్నమే ద్వి కిరీటము కమలము
నారీ నర సమానత్వమే నారాయణత్వము
దీనికి చిహ్నమే లక్ష్మీ నారాయణ సమైక్య చతుర్భుజ   స్వరూపము
జ్ఞాన దానమే శ్రేష్ఠ దానము
శంఖము దీనికి సంకేతము
అహింసయే పరమ ధర్మము
మనో వికారాలపై విజయానికి అదియే ఆధారము
దించిన గద ఇందుకు నిదర్శనము
తరతరాలకూ ఆదర్శము
ఇదియే నా స్వరూప రహస్యము
ఇది నిత్యము సత్యము సుందరము
మానవత లేని మతాచరణ అపచారము
సమానతలేని ఆచారము దురాచారము
భజన అర్చన కీర్తన సర్వ సాధారణము
లక్షణ ధారణలోనే ఉంది యదార్ధ పరమార్ధము
అప్పుడే అవుతుంది నీ జన్మ సార్ధకము
అదియే స్వయానికీ లోకానికీ కళ్యాణ కారకము
పరమాత్మ తో జోడించు రాజయోగము
అది అందించును నీకు విశ్వ రాజ్య భాగ్యము
అదియే నా నివాసము వైకుంఠము
దుష్ఠులకు కంటక సమము

English Shayri by Bk swan and lotus translators : 111069684
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now