Orei Bawa - Osei Maradala - 6 in Telugu Comedy stories by Devanshika Janu books and stories PDF | ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 6

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 6

ఈసారి రాధ గారు సుధ గారు వెలిగిపోతున్న మొహంతో ఒకరినొకరు చూసుకుని “ మరి ఇంతకుముందు ఏమీ జరగలేదు అన్నావు??? దాని అర్థం ఏంటి???? “ అని అడిగారు

@@@@@@@

“ అలా అంటే మీ రియాక్షన్ ఏంటి అని అన్నాను జస్ట్ ఫ్రాంక్..... మీరు దాన్ని పట్టించుకుంటే ఎలా??? అయినా అత్త ఉదయం లేవగానే నా వాలకాన్ని నీ కొడుకు వాలకాన్ని చూశాక కూడా నీకు ఎలా ‌డౌట్ వచ్చింది మా ఇద్దరి మధ్య ఏమి జరగలేదని??? రూమ్ అవతారం కూడా చూసావుగా అందుకేగా కళ్ళు తేలేసి మరి బయటికి వచ్చావు??? “ అని దబాయించి మరి అడిగింది

“ అదేనే ఆ డౌట్ కొట్టే అంత అయిపోయిందా లేదా అని రూమ్ లోకి వెళ్లే ముందు నీ మాటలతో మా మనసులో ఒక అనుమానం రేకెత్తించి ఇప్పుడు నీ సిగ్గుతో తుడిచిపెట్టుకుపోయేలా చేసావు..... సర్లే పద వంట చేద్దాము..... “ అంటూ సీత చేతులు పట్టుకొని లాకెళ్తూ ఉంటే “ ఆ అత్త నేను రాను.... “ అని ఏడుపు మొహం పెట్టి చిన్న పిల్లలా గింజుకుంది

సుధ గారు చిరు కోపంగా “ ఇక్కడ అంటే మేము వండి పెడతాం మీరు కాపురానికి వెళ్లాక అక్కడ నీ మొగుడు వండి పెడతాడా నీకు???? మూసుకొని పోయి వంట నేర్చుకో పో..... ఒంటి మీదకి వయసు వచ్చాక వంట నేర్చుకోమని చెప్తే అత్త మామ అంటూ వాళ్ళ వెనక తిరిగి ఇప్పుడు వంట చేయమంటే నాకు రాదు అత్త అంటూ వయ్యారంగా చెప్తున్నావా???

పోవే పో కిచెన్ లోకి పోయి వంట మొత్తం నువ్వే చెయ్యి విత్ వదిన హెల్ప్ తో...... వదిన నిన్ను గైడ్ మాత్రమే చేస్తుంది..... నువ్వు వంట చేసేయ్..... మనుషులు తినేలా చెయ్ కుక్కలు కూడా ముట్టుకోకుండా ఉండేలా చేయకు..... “ అని వార్నింగ్ ఇచ్చారు

సీత అమ్మ అని అరవగానే ఏంటే అని బేస్ వాయిస్ లో అని సుధ గారు అంటారు

సుధా గారిని చూసి సీత పిల్లిల మ్యావ్ అంటూ ఏమీ లేదని ముడుచుకుపోయి “ పద అత్త వంట చేద్దాము..... “ అని రుసరసలాడుతూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది

సుధ గారు నవ్వుకుంటూ తిక్క పిల్ల అనుకొని బయట పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయారు

కిచెన్ లోకి వెళ్లిన సీత తన అత్త మీద యుద్ధానికి దిగుతూ “ నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా అత్త??? ఎందుకు నన్ను అనవసరంగా వంట చేస్తాను అని బుక్ చేస్తున్నావు???? అసలు వంట నేను చేయటమేంటి????

నాకు అసలు గ్యాస్ స్టవ్ వెలిగించడం కూడా రాదు అటువంటిది నేను వంట చేస్తే మీరు అది తిని బ్రతికే ఉంటారా???? ఎందుకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు నా చేత చేయించడం!!!!! ఇలాంటివి చేసి అందరి ముందు నన్ను తిట్టించాలని చూస్తున్నావు కదా!!!!

నీ కొడుకుని పెళ్లి చేసుకొని నీ కోడలు అవ్వగానే అత్త అధికారం వచ్చేసింది అందుకే అందరి అత్తగారిలా కోడలిని ఇరికించే ప్రోగ్రాం పెట్టుకున్నావు..... “ అని ముక్కు చీదుతూ అంది

రాధ గారు నోటి మీద చేతులు వేసుకొని “ హవ్వ హవ్వ నన్ను ఎంతమాట అన్నావే!!! నీకు నా గురించి తెలియదా సీత నేను అలా చేస్తానా చెప్పు???? నీకు అంత ఇబ్బందిగా ఉంటే వెళ్ళు రూమ్ లోకి వెళ్లి పడుకో పో.....

ఏదో అందరి ముందు నిన్ను గ్రేట్ చెఫ్ ని చేద్దామని నేననుకుంటుంటే నాకు అలాంటి పొగడ్తలు అవసరం లేదు అందరూ ఏమనుకున్నా అనవసరం అని అంటున్నావు!!! ఇక నేనెందుకు నీకోసం ఆలోచించటం నీ ఇష్టం వచ్చింది చేసుకో..... “ అని నిష్టూరంగా అన్నారు

రాధ గారు తన మాటలకి బాధపడుతున్నారని అర్థమై “ సారి సారి అత్త నిద్ర తక్కువయి కళ్ళు మంటలు పుడుతున్నాయి..... ఆ కోపంలో ఇరిటేషన్లో ఏదేదో అనేసాను..... నువ్వు నాకు చెప్తూ ఉండు నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాము..... మనం ఇద్దరం కలిసి వంట విషయంలో తగ్గేదేలే అందర్నీ మన టిఫిన్ తో అదరగొట్టాల్సిందే!!! “ అని పుష్పా లెవల్లో యాటిట్యూడ్గా అంది

“ అవసరం లేదులే నేను కావాలని నిన్ను ఇరికించాను అన్నట్టు అనిపిస్తుంది కదా నీకు!!!! నా కోడలు అంటే నాకు చాలా ఇష్టం నా కొడుకు కంటే కూడా నా కోడలినే చిన్నప్పటినుంచి ఎక్కువగా చూసుకున్నాను కానీ ఇప్పుడు నా కోడలే నన్ను అనుమానిస్తుందని అనుకోలేదు..... ఇక నేనెందుకు ఇవన్నీ చేయాలి??? అవసరం లేదులే!!!! “ అంటూ సేమ్ సీత లాగే ముక్కు చీదుతూ

బయటికి వెళ్తూ ఉంటే సీత కంగారుగా రాధ గారి చేతులు పట్టుకొని వెనక్కి లాగి మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దులు పెడుతూ “ సారీ అత్త సారీ సారీ నువ్వు నాకు టిఫిన్ చేయటం నేర్పించే వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు...... “ అని ముద్దులు పెడుతూనే అంది

సీత అల్లరికి రాధ గారు నవ్వుతూ “ సరే సరే నేర్పిస్తాలే ఈ ముద్దులేవో నా కొడుకుకి పెట్టు ఉదయం పెట్టుకున్నట్టు..... “ అని ముసిముసిగా నవ్వుతూ చెప్పి “ ముందు స్వీట్ చేయాలి పరమాన్నం చేద్దాము ఎలా చేయాలో నేను చెప్తాను నువ్వు చేస్తూ ఉండు..... “ అంటూ

రాధ గారు ఎలా చేయాలో చెప్తూ ఉంటే సీత కష్టంగా చేసి చివరిగా అడుగున మాడ్చి అదే తీసుకువెళ్లి దేవుడికి ప్రసాదంగా పెట్టి తిరిగి కిచెన్లోకి వచ్చి “ హమ్మ ఒక పని అయిపోయింది..... “ అంటూ నుదిటి మీద చెమటలు తుడుచుకొని “ ఒక్క వంటకే చూడు నా ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది..... ఇక టిఫిన్ అంటే ఎంత టైం పడుతుందో ఎంత శక్తిని ధారపోయాలో!!!! “ అని నీరసంగా రాధ గారి భుజం మీద వాలిపోయింది

“ మరి టిఫిన్ ప్రిపేర్ చేయకుండా వెళ్ళిపోతావా??? నన్ను మీ అమ్మ ముందు ఓడిస్తావా సీత??? “ అని సెంటిమెంటల్ సీన్ కి తెర లేపారు రాధ గారు

“ నో నో అమ్మ ముందు నువ్వు ఎప్పటికీ ఓడిపోవడానికి నేను ఒప్పుకోను...... చేస్తాను టిఫిన్ నే కదా ఎవరికి ఏది ఇష్టమో అన్ని చేస్తాను..... నువ్వు చెప్తూ ఉండు..... “ అంటూ ఉప్మా పెసరట్టు ఇడ్లీ దోశ వడ నాలుగు రకాల చట్నీలు మూడు గంటలు కష్టపడి సీత చేత చేయించి అటు ఇటుగా టేస్ట్ పర్వాలేదు అనుకొని అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసరికి

అప్పటికే అందరూ రెడీ అయ్యి హాల్లో కూర్చుని ఉంటే సుధ గారు “ ఈరోజు సీతనే వంట చేస్తుందని..... “ బాంబు పేల్చేసరికి అందరూ టెన్షన్ గా “ ఎలాంటి టిఫిన్ చేస్తుందో??? అది ఎలా ఉంటుందో???? ఆరోగ్యానికి హానికరం ఏమో!!! ముందుగానే అన్ని టెస్ట్ లు చేసుకోవాలి!!! లేకపోతే ఫుడ్ మొత్తం ల్యాబ్ కి పంపించాలి..... “ అని ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ అన్నారు

ఇంతలో సీత టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టడం చూసి అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని “ యుద్ధానికి సిద్ధమవ్వండి విజయమో వీరమరణమో అక్కడే తేలుతుంది..... “ అని సర్కాస్టిక్ గా రామ్ చెప్తే అందరూ ఫక్కున నవ్వేస్తారు

వాళ్ల నవ్వులు విని సీత ఏమైందని అడగగా రామ్ నవ్వుతూ “ ఏమీ లేదు సీత ఈరోజు నువ్వే టిఫిన్ చేసావు కదా అద్భుతంగా ఉంటుంది...... ఇలాంటి టిఫిన్ మీరు జీవితంలో మరొకసారి తినలేరు..... నా భార్య చేతి వంట అమృతం ఒక్కసారి తింటే వదల్లేరు అని చెప్తున్నాను..... “ అని పళ్ళన్ని బయటపెట్టి వెక్కిరింతగా అన్నాడు

కానీ అది మన ఇన్నోసెంట్ సీతకి అర్థం కాక “ థాంక్యూ థాంక్యూ బావ నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు!!! నీ నమ్మకాన్ని నేను ఒమ్ము పోనివ్వను.... రండి రండి అందరూ టిఫిన్ చేసి ఎలా ఉందో చెప్పండి.... మీరందరూ తిన్నాక నేను తింటాను..... “ అని హుషారుగా అంది

అందరూ భయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని “ ఏం ఫస్ట్ మా మీదే ఎక్స్పెరిమెంట్ చెయ్యాలా??? మొదట నువ్వు తిని నీకు టేస్ట్ నచ్చితే మేము తింటాము కదా!!! “ అని రామ్ గుటకలు మింగుతూ అన్నాడు

సీత బుంగమూతి పెట్టుకుని “ అంటే ఏంటి నీ మాటల అర్థం నేను టిఫిన్ సరిగా చేయలేదు అది తింటే మీరు మంచాన పడతారు అనే కదా!!!! అంటే ఇంతకుముందు నువ్వు నా టిఫిన్ అమృతం అన్నది వెక్కిరింతగా అన్నావా??? నీకు నేనంటే లెక్కేలేదు బావ..... “ అంటూ గరిట పట్టుకొని రామ్ మీదకి వస్తూ ఉంటే రామ్ “ వద్దు సీత వద్దు పెళ్లయిన రెండో రోజే మొగుణ్ణి కొడితే అందరూ నిన్ను సీలి రాకాసి అనుకుంటారు...... యాక్చువల్ గా అదే నిజం కానీ ఇప్పుడు నన్ను కొట్టి మరి అందరికీ నువ్వు నిరూపించాల్సిన అవసరం లేదు..... “ అని

హాల్ మొత్తం పరిగెడుతూ ఉంటే సీత రామ్ వెనుక పడుతూ “ నేను కాదురా సీలిరాకాసిని నువ్వే బ్రహ్మ రాక్షసుడివి...... పెళ్ళాన్ని వెక్కిరించే వాడివి ఈ ప్రపంచంలో నువ్వొక్కడివే అయ్యుంటావు...... ఎవరైనా పెళ్ళాన్ని వెనకేసుకొని వస్తారు నువ్వు మాత్రం ప్రతి దానికి నన్ను వెక్కిరిస్తూ డిస్కరేజ్ చేస్తూ ఉంటావు..... “ అంటూ

రామ్ ని పట్టుకొని జుట్టు పట్టుకొని ఒంగోపెట్టి తల మీద గరిటతో కొడుతూ ఉంటే సుధ గారు సీతను పట్టుకొని ఆపి “ ఏంటే ఇది మొగుణ్ణి కొట్టడం మర్యాద అనిపించుకుంటుందా??? ఇంకొకసారి రామ్ మీద చేయి లేపావు అంటే బాగుండదు చెప్తున్నా..... “ అని సీరియస్గా అన్నారు

“ అనండి అందరూ నన్నే అనండి వాడిని మాత్రం ఏమీ అనకండి..... చూడత్త నీ కొడుకు నన్ను ఎలా అంటున్నాడో??? నువ్వు కూడా నవ్వుతూ చూస్తున్నావు కానీ నీ కొడుకుని ఏమీ అనలేదు అంటే నీ కొడుకు అన్నది నిజమని నువ్వు కూడా నిరూపిస్తున్నావు కదా!!!!

పో అత్త నేను అలిగాను..... ఈ పూట నేను టిఫిన్ చేయను..... మధ్యాహ్నానికి చికెన్ బిర్యానీ వండి పెట్టు ఫుల్ గా తినేసి నిద్రపోతాను...... “ అని చెప్పి రూమ్ లోకి వెళుతూ ఉంటే


ఇంకా ఉంది.....

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.....