Orei Bawa - Osei Maradala - 4 in Telugu Comedy stories by Devanshika Janu books and stories PDF | ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 4

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 4

చిన్నప్పటినుంచి మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూనే పెరిగాం కానీ పెళ్ళన గానే ఎందుకో నో చెప్పలేకపోయాను సీత ..... అది ఎందుకనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు !!! కానీ నీ మెడలో తాళి కట్టేటప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ...... ఈ ఫీలింగ్ ని ఏమంటారో నాకు తెలియదు కానీ బాగుంది ..... ఇప్పుడు కూడా నువ్వు చిన్నపిల్లల నాతో గొడవ పడుతూ ఉంటే భలే బాగుంది ...... “ అని నవ్వుకుంటూనే నిద్రపోయాడు

@@@@@@@

తర్వాత రోజు ఉదయం 5 గంటల సమయం సీత రామ్ ల రూమ్ డోర్ దబ దబ బాదుతున్న సౌండ్ కి రామ్ కష్టంగా కళ్ళు తెరిచి కిటికీలో నుంచి బయటికి చూస్తే ఇంకా చీకటిగా ఉండటం అందులోనూ తన మీద కొంచెం బరువుగా ఉండటం అర్థమవుతున్న పట్టించుకోకుండా తనని ఎవరు వచ్చి తనని డిస్టర్బ్ చేసారో అర్థం కాక తనమీద బరువు ఏంటా అని చూసేసరికి రెండు కాళ్లు పూర్తిగా రామ్ మీద వేసి చేతిని రామ్ నడుము చుట్టూ వేసి తన గుండెల మీద ఆదమరిచి ముద్దుగా పడుకొని ఉన్న సీతని అంటే సీత ముప్పావు వంతు శరీరం మొత్తం రామ్ మీద ఉండటం చూడగానే పెదవుల మీద చిరునవ్వు చేరి తెలియకుండానే తన నుదిటి మీద ముద్దు పెట్టి తన్మయత్వంగా తన వైపే చూస్తూ ఉంటే

మళ్ళీ డోర్ సౌండ్ కి “ అబ్బా ఎవరు కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరా???? “ అని విసుకుంటూ సీతని జాగ్రత్తగా పక్కన పడుకోబెట్టి తన పంచె ఊడిపోయింది కూడా చూసుకోకుండానే తల గీరుకుంటూ తలుపు తీసి మండుతున్న కళ్ళని నలుపుకుంటూనే కష్టంగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రాధ గారిని చూసి “ ఏంటమ్మా ఈ టైంలో వచ్చి నిద్ర లేపావు ‌??? నైట్ అంతా సరిగా నిద్రపోలేదు..... ఎప్పుడో ఉదయం పడుకున్నాము మంచి నిద్ర పాడు చేశావు తెలుసా !!!! “ అని చిరాకుగా అంటాడు

రాధ గారు రామ్ మాటలకి ఆశ్చర్యంతో నోటి మీద చేయి వేసుకుని తనని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి గుడ్లురుముతూ “ ఒరేయ్ వెధవ సన్నాసి నిన్ను నువ్వు చూసుకున్నావా ఒకసారి అయినా???? శోభనం గదిలో నుంచి ఇలానేనా వచ్చేది ??? మొహం మీద గుండెల మీద ఆ కుంకుమ ఏంటి కాళ్ళకి పంచె ఏదిరా మొద్దు సన్నాసి??? “ అని తల మీద గట్టిగా మొట్టగానే

రామ్ కి దెబ్బకి నిద్ర మత్తు వదిలి తల రుద్దుకుంటూనే తన పంచె వైపు చూసుకోగ అది లేక వట్టికాళ్ళు దర్శనం ఇవ్వగానే “ అయ్ బాబోయ్ “ అంటూ డోర్ దగ్గరగా వేసి తలుపు వెనక దాక్కొని రాధ గారి వైపు తొంగి చూసి ఇబ్బందిగా నవ్వుతూ “ సారీ అమ్మ చూసుకోలేదు ..... ఇంతకీ ఎందుకు లేపావో చెప్పు నాకు బాగా నిద్ర వస్తుంది వెళ్లి పడుకుంటాను!!!! “ అని అంటాడు

“ నాకు నీతో పనిలేదు రా సన్నాసి నా కోడలిని లేపు..... “ అని అంటారు

రామ్ సీత వైపు చూసేసరికి సీతకి సోయకూడా లేక మొద్దు నిద్రపోతూ ఉంటే అది చూసి “ అదెక్కడ లేస్తుంది అమ్మ పంది లా గుర్రు పెట్టి పడుకుంది...... నైట్ పడుకోవడానికి లేట్ అయింది అదిప్పుడల్లా లేవదు...‌‌... నీకు తెలుసు కదా దాని బద్ధకం గురించి!!! “ అని వెటకారంగా అంటాడు

రాధ గారు కళ్ళు పెద్దవి చేసి నోటిమీద చేయి వేసుకొని “ ఒరేయ్ ఒరేయ్ పిచ్చి సన్నాసి ఇంత పచ్చిగా మాట్లాడుతున్నావ్ ఏంటి రా???? పెళ్లి కాకముందు ఎంత బుద్ధిగా ఉండే వాడివి!!!!! పెళ్లయి శోభనం అయ్యిందో లేదో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నావ్!!!! నువ్విక నోరు మూసుకుని వెళ్లి సీతని లేపుతావా లేకపోతే నన్నే లేపమంటావా??? “ అని అడుగు లోపల పెట్టబోతు ఉంటే

రూమ్ అంతా చిందర వందరగా ఉండటం చూసి గొడవ పడ్డారేమో అనుకుంటారేమోనని పొరబడి రామ్ కంగారుగా “ వద్దు వద్దు నేనే లేపుతాను.... “ అని రామ్ నే వెళ్లి సీతని తడుతూ “ సీత అమ్మ పిలుస్తుంది లేవవే లేకపోతే అమ్మ లోపలికి వస్తుంది.....

అమ్మగాని లోపలికి వచ్చిందంటే ఈ రూమ్ అవతారం చూసి గొడవపడ్డామని గెస్ చేసి మళ్ళీ మనకి క్లాస్ పీకుతారు..... “ అని చెవిలో జోరీగల అరుస్తూ ఉంటే సీత బద్ధకంగా పైకి లేచి “ ఏంట్రా నీ కాకి గోల??? కొంచెం సేపు కూడా ప్రశాంతంగా పడుకోనివ్వవా??? “ అని కళ్ళు తెరవకుండానే ఒళ్ళు విరుస్తూ అంది

సీత పడుకోవటమే అస్తవ్యస్తంగా పడుకోవటం వలన చీర కూడా అష్టవ్యస్తంగా చెదిరిపోయి పడుచు అందాలు కనిపిస్తూ ఉంటే రామ్ వాటి వైపు గుడ్లప్పగించి చూస్తూ ఉంటాడు......

తల గోక్కుంటూ కష్టంగా కళ్ళు తెరిచి అభి వైపు చూసిన సీతకి తన వైపే కళ్ళు పెద్దవి చేసి చూడటం గమనించి నిద్రమత్తులోనే ఏమైంది అని తనని తాను చూసుకుని ఆ...ఆ అని గట్టిగా అరుస్తూ ఉంటే రామ్ కంగారుగా తన నోటి మీద చేతులు వేసి “ ఒసేయ్ ఒసేయ్ అమ్మ బయటే ఉందే!!!! నువ్విలా అరిస్తే నేను నిన్నేదో చేసాననుకోని నన్ను కొడుతుంది..... ఏంటా ఆరవటం??? “ అని కళ్ళు చిన్నవి చేసి అరిచాడు

సిత అరపుకి కంగారుపడి లోపలికి వచ్చిన రాధ గారు వాళ్ళిద్దరి పొజిషన్ చూసి కళ్ళు పెద్దవి చేసి వెంటనే వెనక్కి తిరిగి రామ రామ అని కళ్ళు గట్టిగా మూసుకుంటారు......

ఎందుకంటే రామ్ సీత ఎదురుగా నిలబడి ఉంటే సీత బెడ్ మీద కూర్చుని రామ్ కి అభిముఖంగా ఉంది......

రామ్ సీత నోరు మూయటం వెనుక నుంచి చూసిన వాళ్లకి లిప్ కిస్ చేస్తున్నట్టు కనిపించి రాధ గారు అలా వెనక్కి తిరిగారు.,...

రాధగారి అరుపులకి రామ్ కంగారుగా సీతని వదిలేసి వెనక్కి తిరిగితే సీత కంగారుగా పైకి లేచి తన చీరని సరి చేసుకుంటూ “ అత్త నువ్వేంటి ఇక్కడ??? “ అని అడిగింది

రాధ గారు సీత మాటకి వెనక్కి తిరిగి చూస్తే రామ్ ఇంకా పంచె కట్టుకోకుండా ఉట్టి కాళ్ళ మీద ఉండటం సీత నలిగిపోయిన చీర తెగిపోయిన పూలు చెదిరిపోయిన మంచం చెల్లాచెదురైన ఫ్రూట్స్ స్వీట్స్ మొత్తం చూసి అంతా సవ్యంగా జరిగిందని అనుకొని సంతోషంగా ఉన్నా

బయటికి మాత్రం కోపం నటిస్తూ. “ ఏంట్రా నువ్వు చేసే పని???? సీతని లేపమని పంపిస్తే దానిని ముద్దు పెట్టుకుంటున్నావా??? “ అని అరిచి సీత వైపు చూస్తూ “ నువ్వు వాష్ రూమ్ లోకి వెళ్ళి వెళ్లి ఫ్రెష్ అయ్యి రా..... “ అని అన్నారు

రాధ గారి కోపం చూసి సీత భయపడి సరే అత్త అని వాష్ రూమ్ లోకి వెళ్ళిపోతే రామ్ అయోమయంగా రాధ గారి వైపు చూస్తూ “ మేము ఎక్కడ ముద్దు పెట్టుకున్నామమ్మా???? నువ్వేదో పొరపడినట్టున్నావ్ !!!! “ అని అంటూ ఉంటే “ నా కళ్ళేమీ నన్ను మోసం చేయవు నోరు ముయ్యరా.....

ముందు ఆ పంచె కట్టుకో..... ఎన్నిసార్లు చెప్పాలి ఛ ఛ ఈ కాలం పిల్లలకి అడ్డు అదుపు లేకుండా పోయింది..... “ అని అంటూనే ఒక చీర బెడ్ మీద పెట్టి “ సీత రాగానే ఇది కట్టుకోని కిందకి రమ్మని చెప్పు.... “ అని చెప్పి బయటికి వెళ్లిపోతారు

రామ్ అయోమయంగా వెళ్ళిన రాధ గారి చూస్తూ “’అసలు ఇక్కడ ఏం జరిగిందని అమ్మ నా మీద ఇంత కోప్పడుతుంది???? నాకేమీ అర్థం కాలేదు!!!! జస్ట్ పంచె కట్టుకొని దానికే ఇంతలా అరవాలా ??? “ అని తలకోక్కుంటూనే పంచే తీసుకొని “ ఛ ఇది నాకు కట్టుకోవడం రావట్లేదు పెట్టట్లేదు కట్టుకున్న ఒంటిమీద నిలబడటం లేదు..... ఇంకెందుకు ఇది??? “ అంటూ పక్కన విసిరేసి బెడ్ మీద పడిపోయి ఇందాక ఆగిన నిద్రని మళ్లీ ఆహ్వానించి దుప్పటి కప్పుకుని నిద్రపోతాడు

సీత తన నిద్రమత్తుని అంతా వదిలేలా ఒక అరగంట పాటు తల స్నానం చేసి టవల్ చుట్టుకొని రాధ గారు ఉన్నారేమోనని తల బయటికి పెట్టి చూస్తే ఎవరూ లేక రామ్ గుర్రు పెట్టి నిద్రపోవడం చూసి “ హమ్మయ్య అత్తయ్య లేదు వీడేయో నిద్రపోతున్నాడు వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి..... “ అనుకుంటూ బయటికి రాగానే

“ అవును ఇక్కడ డ్రెసెస్ ఏమి లేమీ లేవు కదా ఇప్పుడు నేనేం వేసుకోవాలి??? “ అనుకుంటూ రామ్ వైపు చూసేసరికి రామ్ పక్కనే చీర కనిపించి హమ్మయ్య బ్రతికిపోయాను అనుకుంటూ ఆ చీరలో బ్లౌజ్ లంగా తీసుకుని వాష్ రూమ్ లోకి వెళ్లి వేసుకొని వచ్చి

“ ఇప్పుడు ఈ చీరని ఎలా కట్టుకోవాలి రా దేవుడా???? నాకు అసలు చీర కట్టుకోవడం రాదు..... లంగా ఓణినే అంతంత మాత్రం...... “ అని విసుగ్గా అనుకుంటూ యూట్యూబ్ ఓపెన్ చేసి కష్టంగా తనకి వచ్చినట్టు చీర కట్టుకొని బయటికి వెళుతుంది

సీత బయటికి వచ్చి చీర కట్టుకుంటుంటే తన గాజులు చప్పుడికి నిద్ర భంగం కలిగిన రామ్ అసహనంగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగా అప్సరసలాగా అందాలన్నీ ఆరబోస్తూ సీత కనిపించేసరికి ఫ్రీజ్ అయ్యి కళ్ళని సీత అందాలకు అప్పగించి చూస్తూ ఉంటాడు......

అలా తనకి నచ్చినట్టుగా వచ్చినట్టుగా చీర కట్టుకొని మళ్లీ రామ్ వైపు చూడగానే గట్టిగా కళ్ళు మూసుకుంటాడు.......

సీతా వెళ్లిపోయాక కళ్ళు తెరిచిన రామ్ వెల్లకిలా పడుకొని తలకింద చేతులు పెట్టి నవ్వుతూ కళ్ళు మూసుకోగానే ఒక్కసారిగా సీత అందాలన్ని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే బాబోయ్ “ ఇది ఎంత అందంగా ఉంది??? ఇన్నాళ్లు గమనించలేదు కానీ ఇది గొప్ప అందగత్తె!!!! “ అని చిన్నగా బ్లష్ అవుతూ

వెంటనే తల విధిలించి భయంగా “ సీత పర్మిషన్ లేకుండా చూడటం రేపు తనకి ఈ విషయం తెలిస్తే నన్ను బ్రతుకు నిస్తుందా??? కానీ ఏ మాటకా మాటే చెప్పుకోవాలి ఆ నడుము చూడు ఎంత అందంగా ఉందో!!!! సన్నగా నాజూకుగా ఆ నడుము మీద మడత చూస్తూ ఉంటే ఒక్కసారి టచ్ చేయాలనిపిస్తుంది..... “ అని అనుకొని

వెంటనే స్పృహలోకి వచ్చి “ అది జరిగే పని కాదులే అసలే సీలి రాకాసి..... “ అని అనుకోని ఒక నిట్టూర్పు విడిచి మళ్లీ కళ్ళు మూసుకొని నిద్రపోయాడు

బయటికి వచ్చిన సీతని చూసిన రాధ గారు నవ్వుతూ “ ఏంటే ఈ చీర కట్టుకోవటం??? “ అంటూ సీతని రూమ్ లోకి తీసుకువెళ్లి చీరని సరిగ్గా కట్టి బయటికి తీసుకువచ్చి దీపం పెట్టు అని చెప్పగానే సీత పూజ గది మొత్తం క్లీన్ చేసి దీపం పెట్టి హారతి తీసుకొని బయటికి వచ్చాక రాధ గారికి ఇచ్చి లోపలికి వెళ్తూ ఉండగానే సుధ గారు కూడా రెడీ అయి రావటం చూసి సుధ గారికి కూడా ఇచ్చింది

సుధ గారు ఆశ్చర్యంగా సీత వైపు చూస్తూనే హారతి తీసుకుంటే సీత లోపల పెట్టి రాగానే “ ఇలాంటి మంచి బుద్ధులు ఎప్పటినుంచి నేర్చుకున్నావు సీత??? ఎన్నిసార్లు పద్ధతిగా ఉండమని చెప్పినా నేను ఉండను అంటూ అంతే మొండిగా మాట్లాడిన దానివి ఈరోజు పద్ధతిగా ఉండటమే కాకుండా దీపరాదని కూడా చేయటమేంటి??? అబ్బో దీన్ని ఇలా చూస్తుంటే భూకంపం వచ్చేలా ఉంది..... “ అని వేళాకోళంగా చిరునవ్వుతో అన్నారు

సీత బుంగమూతి పెట్టి అత్తయ్య అనగానే రాధ గారు సుధ గారితో “ నువ్వు ఆగు వదిన ఎందుకు ప్రతిసారి నా కోడల్ని అంటావు???? నా కోడలు అన్నిట్లో ది బెస్ట్ తెలుసా!!!! నేను చెప్పకుండానే పూజ మొత్తం చేసింది ఇప్పుడు స్వీట్ కూడా చేస్తుంది చూడు..... ‘ అని చిటికి వేసి మరి చాలెంజ్ చేసి సీతవైపు చూసేసరికి సీత గుడ్లూరుమి రాధ గారి వైపు చూస్తుంది

ఇంకా ఉంది.....

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.....