Orei Bawa - Osei Maradala - 3 in Telugu Comedy stories by Devanshika Janu books and stories PDF | ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 3

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 3

సూర్యనారాయణ గారి చెల్లెలు చెల్లెలి భర్త వాళ్ళ పిల్లలు చిన్నగా ఉండగానే యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళని సూర్యనారాయణ గారు చేరదీసి వాళ్ళ ఇంట్లోనే ఉంచి తన కొడుకు కూతురుతో పాటు సమానంగా పెంచుతారు..... వారే సురేంద్ర గారు రాధ గారు

అలా నలుగురికి యుక్త వయసు వచ్చాక ఒకరికొకరు ఇష్టమని తెలుసుకొని కుండ మార్పిడి పెళ్లిళ్ల లాగా వీరేంద్ర గారికి రాధ గారిని సుధ గారికి సురేంద్ర గారితో పెళ్లి చేస్తారు..... వాళ్ళ పిల్లలే మన హీరో హీరోయిన్ అభిరామ్ సీతామహాలక్ష్మి......

@@@@@@

సుధ గారికి సీతామహాలక్ష్మి కంటే ముందు రెండు సార్లు అబార్షన్ అవ్వటం వలన సీతామాలక్ష్మి పుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు......

రాధ గారికి మొదటిసారి అందటంతోనే అభిరామ్ పుట్టేశాడు.....

అలా సీతామహాలక్ష్మి అభిరామ్ కంటే రెండు సంవత్సరాలు చిన్నది......

వీళ్ళ అందరిది ఉమ్మడి కుటుంబం అనగా వీరభద్రపురంలో వారి మండువలోగిలి ఇంట్లోనే కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటున్నారు.....

సురేంద్ర గారు వీరేంద్ర గారు సూర్యనారాయణ గారి పొలాలు చూసుకుంటూ బావా బావమరిది లాగా కాకుండా అన్నతమ్ముల లాగా ఒకరి విషయం మరొకరితో షేర్ చేసుకుంటూ ఉంటే సుధ గారు రాధ గారు సొంత అక్క చెల్లెల లాగా మెలుగుతూ చిన్న గొడవ కూడా ఫ్యామిలీలో రాకుండా ఇంతవరకు జాగ్రత్త పడ్డారు..... ఇకపై మరి తెలియదు!!!

మహాలక్ష్మి గారికి నలుగురిని చూసి చాలా ముచ్చట వేసేది!!!! చిన్న గొడవ కూడా లేకుండా ఎంతో అన్యోన్యం గా ఉంటున్నారని!!!!

అభిరామ్ సీత మహాలక్ష్మి పుట్టినప్పుడే పెద్దవాళ్లు అనుకున్నారు ఇద్దరికీ పెళ్లి చేసి ముడి పెట్టేయాలని ఆ తర్వాత ఇక పిల్లలు వద్దు అనుకొని వారి ఇద్దరితోనే సరిపెట్టుకున్నారు.....

రామ్ సీత లు చిన్నప్పుడు కలిసి ఆడుకుంటూ నవ్వుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూనే పెరిగారు...... ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో సీత ఎవరితోనైనా క్లోజ్ గా మాట్లాడితే రామ్ కి నచ్చక సీతని అరిస్తే రామ్ అరిచాడని మొదట సీత ఏడ్చిన తర్వాత తిరిగి రామ్ ని కొట్టేది......

అలా చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలి వానగా మారి వాళ్ల మధ్య నువ్వేంతంటే నువ్వేంత అన్నట్టు ఇప్పుడు ఉన్నారు కానీ పెద్దవాళ్ళకి వాళ్ల మధ్య గొడవలు తెలియనివ్వకుండా వాళ్ల ముందు మాత్రం బావ మరదలు అంటే ఇలా ఉండాలి అన్నట్టు మెలిగేవారు.....

లైక్ రామ్ డైరీ మిల్క్ కొంటే అందులో సగం సీతకి ఇచ్చేయటం...... ఐస్ క్రీమ్ కొంటే రామ్ తిన్నాకే సీత తినటం అది కూడా ఓకే ఐస్ క్రీమ్ షేర్ చేసుకుంటూ తినటం చూపించి అలా పెద్ద వాళ్ల ముందు మాం....చి కలరింగ్ ఇచ్చారు.....

బికాజ్ ఆఫ్ వాళ్ల పిల్ల కాలువ లాంటి గొడవలు పెద్ద వాళ్లకి తెలిసి బాధపెట్టడం ఇష్టం లేక ఎందుకంటే చిన్నప్పటినుంచి సీతకి రామ్ కి చెప్పే పెంచారు ఇద్దరికీ పెద్దయ్యాక చదువు అయిపోగానే పెళ్లి చేస్తాము అని...... సీత రామ్ వాళ్ళ మాటలు పట్టించుకోలేదు ..... ఎన్ని గొడవలు జరిగిన కానీ సీతకి రామ్ బాదపడితే నచ్చదు రామ్ కి సీత ఏడిస్తే కోపం వస్తుంది.....అలా ఎందుకు వాళ్లకి ఒకరి గురించి ఒకరికి అనిపిస్తుందో తెలుసుకోలేని పసి మనసు వాళ్లది.....

పెరిగేకొద్దీ అభి చదువుకోటానికి సిటీకి వెళ్తే సీత కూడా తన ఇంటర్ అయిపోయాక చదువుకోటానికి సిటీకి వెళ్లిపోయింది..... మరి అక్కడ ఏం వెలగబెట్టారో మనం తర్వాత తెలుసుకుందాం......

ఇలా బావ మరదళ్ల మధ్య ప్రేమ ఉందని తెలిసేలా అందరి ముందు మెలగడం వల్లే ఇద్దరికీ పెళ్లి చేస్తున్నామని కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా రెండు రోజుల్లో మీ పెళ్లి ఈరోజు వచ్చి ఇంట్లో ఉండండి అని ఆర్డర్ వేసినట్టు చెప్పి అప్పటికప్పుడు పిలిచి కనీసం వాళ్ళ అభిప్రాయం కూడా అడగకుండా పెళ్లి చేసేంత వాళ్ళ ముందు కలరింగ్ ఇచ్చారు ......

కానీ ఇద్దరికీ ఆ పెళ్లి చేసుకోవటం పైకి నచ్చకపోయినా మనసులో ఏదో మధురానుభూతి కానీ అది బయట పెట్టకుండా ఒకరికొకరు బయట అందరి ముందు అన్యోన్య దంపతుల లాగా కనిపించి రూమ్ లో మాత్రం పిల్లి ఎలుకల్లాగా కొట్టుకుంటున్నారు.....

ఇది మన సీత అభిరామ్ ల పెళ్లికి ముందు బ్రీఫ్ గా చిన్ననాటి చిలిపి గొడవల కథ.....

@@@@@@@@@

మనం మళ్లీ శోభనం గదిలోకి ఒకసారి తొంగి చూద్దాం పదండి....

రామ్ అలా కొరకగానే సీత కళ్ళు మూసుకుని ఇస్ అంటూ బెడ్ షీట్ ని తన పిడికెళ్ళలో బిగించి నలిపేసింది.....

రామ్ ఆగకుండా వీపు మొత్తం ముద్దులు పెట్టి సీతని తన వైపు తిప్పుకొని గాఢంగా తన పెదవులు అందుకున్నాడు .....

సీత కూడా రామ్ కి సహకరిస్తూ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి పిడికిలి బిగిస్తుంది......

రామ్ పావుగంట పాటు ముద్దు పెట్టి చివర్లో పెదవి కొరకి వదిలేయగానే అప్పుడు స్పృహలోకి వచ్చిన సీత ఒక్కసారిగా రామ్ ని తోసేసి “ ఒరేయ్ ఏం చేసావురా??? “ అంటూ తన పెదవి చూసుకొని “ అయ్ బాబోయ్ వీడు నా పర్మిషన్ తీసుకోకుండా నాకు ముద్దు పెట్టి నా పెదవి కొరికేసాడు రా నాయనా !!!! ఎంత దారుణం జరిగిపోయింది దేవుడా??? వీడు నన్ను ముట్టుకున్నాడురా స్వామి..... “ అని ఎవరో చనిపోయినట్టు ఏడుస్తూ ఉంటే బెడ్ మీద వెల్లకిల పడుకొని ఉన్న ‌రామ్ వికారంగా మొహం పెట్టి యహే ఆపు అని గట్టిగా అరిచాడు

అప్పటికే ఇద్దరు కలిసి అటు ఇటు దొర్లటం వలన రామ్ పంచె మళ్లీ ఎప్పుడో ఊడిపోయి బెడ్ మీద ఒకపక్కగా పడింది......

రామ్ అరవగానే సీత చిన్న పిల్లల కన్నీటితో రామ్ వైపు చూస్తూ నోటి మీద చేతులు పెట్టుకుంటే రామ్ కి జాలిగా అనిపించి సీత తలని ఒక్కసారిగా గుండెకి హత్తుకొని “ సారీ సారీనే తెలియకుండానే అలా జరిగిపోయింది..... ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను.... “ అంటూ లాలనగా చెప్పి ఒక్కసారిగా వదిలేసి పైకి లేవగానే ఈసారి సీత చాలా దగ్గరగా ఉన్న రామ్ దిగంబర స్వరూపం చూసి ఆ...ఆ అని అరుస్తూ కళ్ళు మూసుకుంది.....

రామ్ అయోమయంగా సీత వైపు చూస్తూ “మళ్లీ ఏమైందే??? “ అని తన కాళ్లకు చల్లగా ఏసీ తగులుతూ ఉంటే “ ఏమైందబ్బా ??? “ అనుకుంటూ తనను తాను చూసుకొని “ వాయమ్మో మళ్లీ పంచె ఊడింది రోయ్.... “ అంటూ పంచె తీసుకొని చుట్టుకొని “ ఇది అసలు నిలబడటం లేదే రూమ్ లో నావి ఒక్క జత కూడా పెట్టలేదు మీ అత్త ఏం చేయాలి ఇప్పుడు??? “ అని అసహనంగా అడిగాడు

“ నా చీర ఇవ్వమంటావా??? “ అని కళ్ళు తెరిచి ముసి ముసిగా నవ్వుతూ అడిగింది సీత

రామ్ గుడ్లురుమి సీత వైపు చూస్తూ “ ఇవే ఈ ఎగస్ట్రాలే తగ్గించుకుంటే మంచిది లేదంటే నీ అరుపులకి అంత అయిపోయింది అని బయట టాక్ వస్తుంది..... నా గురించి మాత్రం మంచి స్టామినా ఉన్న వాడు అని బిరుదు పడిపోతుంది ..... “ అని అన్నాడు

రామ్ అన్నది అర్థమైన సీత కళ్ళు పెద్దవి చేసి “ ఛి ఛి నేను ఆ ఉద్దేశంతో అనలేదు నువ్వు మరీ పచ్చిగా మాట్లాడుతున్నావ్ పో పక్కకి..... “ అని ఉడుక్కుంటూ అరిచింది

సీత అలా ఉడుకుంటుంటే రామ్ కి నచ్చి “ నువ్వన్నట్టు నా మీద పంచె‌ నిలబడటం లేదు కాబట్టి నీ చీర ఇవ్వవే నేను కట్టుకుంటానులే గాని..... “ అని స్టాటిస్టిక్ స్మైల్ ఇస్తూ సీత కొంగు పట్టుకోగానే సీత కంగారుగా ‌ఒరేయ్ అని అరుస్తూ “ ఇది పదివేల రూపాయల చీరరా..... నీ మూష్టి వెయ్యి రూపాయల లుంగీలా కట్టుకోవటానికి కొనలేదు.... “ అని రామ్ చేతిలో కొంగు లాగి విసురుగా అంది

రామ్ నోటి మీద ఒక చేతిని నడుము మీద ఒక చేతిని పెట్టుకుని “ మొగుడి కంటే చేరే ఎక్కువైందా నీకు???? ఇలాంటి చీరలు ఆన్ ది స్పాట్ నీకు 10 కొనగలను..... “ అని గొప్పగా అంటాడు

“ నువ్వేంటి కొనేది నేనే కొంటాను నీ డబ్బులతో..... ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా మొగుడివి నీ సంపాదన మొత్తం నాదే కదా!!! “ అని సైడ్ స్మైల్ ఇచ్చి “ ఒక్కసారి కాపురం పెట్టనివ్వు అప్పుడు ఈ సీత అంటే ఏంటో చెప్తా!!! “ అని ఆవలిస్తూ అంది

సీతకి నిద్ర వస్తుందని అర్థమై “ సరేలే కానీ ఇద్దరం కాంప్రమైజ్ అవుదామే...... నువ్వు అటు సైడ్ పడుకో నేను ఇటు సైడ్ పడుకుంటాను..... మధ్యలో పూలని వారధిగా పెడదాము నీ ప్లేస్ లోకి నేను రాను నా ప్లేస్ లోకి నువ్వు రాకు ఓకేనా??? ఇలా అయితే ఇద్దరికీ ఇబ్బంది ఉండదు నాకు కూడా నిద్ర వస్తుంది..... “ అని కన్విన్సింగ్ గా మాట్లాడాడు

సీతకి కూడా రెండు రోజుల నుంచి సరిగా నిద్రలేక రామ్ తో గొడవ వల్ల అర్ధరాత్రి దాటింది కూడా చూసుకోకపోయేసరికి నిద్ర మత్తుకి ఆగనంటూ కళ్ళు మూసుకుపోతూ ఉంటే సరే అని చెప్పి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకోని నిద్రపోయింది......

“ అది నగలు కూడా తీయకుండా పడుకుందే!!! “ అని చిన్నపిల్లల చెంప కింద చేతిని పెట్టుకుని నిద్రపోతున్న సీతని చూసి “ నిద్ర వస్తే ఇది చిన్న పిల్ల అయిపోతుంది..... “ అని నవ్వుకుంటూ నగలన్నీ తీసి జాగ్రత్తగా కబోర్డ్ లో దాచి పంచె మళ్ళీ చుట్టుకుని కష్టంగా పడుకొని సీత వైపు తిరిగి చూస్తూ

“ చిన్నప్పటినుంచి మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూనే పెరిగాం కానీ పెళ్ళన గానే ఎందుకో నో చెప్పలేకపోయాను సీత..... అది ఎందుకనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు!!! కానీ నీ మెడలో తాళి కట్టేటప్పుడు చాలా సంతోషంగా అనిపించింది...... ఈ ఫీలింగ్ ని ఏమంటారో నాకు తెలియదు కానీ బాగుంది..... ఇప్పుడు కూడా నువ్వు చిన్నపిల్లల నాతో గొడవ పడుతూ ఉంటే భలే బాగుంది...... “ అని నవ్వుకుంటూనే నిద్రపోయాడు

ఇంకా ఉంది.....

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.....