Orei Bawa - Osei Maradala - 2 in Telugu Comedy stories by Devanshika Janu books and stories PDF | ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 2

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 2

ఆ అరుపులు బయట వరకు వినిపిస్తూ ఉంటే పెద్ద వాళ్ళందరికి అవి మరోలా అర్థమయ్యి “ ఓరి దేవుడో వీళ్ళకి చాలా స్పీడ్ ఎక్కువైంది..... రూమ్ లోకి వెళ్ళగానే ఇన్ని అరుపులు వినిపిస్తున్నాయి..... “ అని ముసిముసిగా నవ్వుకుంటూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు

@@@@@@

మళ్లీ మనం వెళ్లి రూమ్ లోపల చూద్దాం ఇద్దరు ఫ్రూట్స్ స్వీట్స్ అన్ని విసిరేసుకుని బెడ్ ని చిందరవందర చేసే బెడ్ మీద ఉన్న పూలన్నీ రూమ్ మొత్తం పడేలా చెల్లా చెదురు చేసి ఒకరినొకరు కొట్టుకొని అలసిపోయి దాహంగా అనిపించి పాలు తాగుదామనుకొని ఇద్దరు ఒకేసారి పాల గ్లాస్ వైపు కన్నెయగానే “ రేయ్ వాటి వైపు చూడకు అవి నావి..... “ అంటూ గ్లాస్ చేతిలోకి తీసుకోగానే రామ్ సీత చేతిలో నుంచి పాలు లాక్కొని “ నీవెక్కడేవే!!! అయినా ఫస్ట్ నైట్ గదిలో మొగుడు తాగాక పెళ్లాం తాగాలని మినిమం కామన్ సెన్స్ లేని పెళ్ళానివి నువ్వే అనుకుంటా!!! “ అంటూ వెటకారం గా చెప్పి ఒక్క గుటకలో మొత్తం పాలు తాగేసి హామ్ ఫట్ చేసాడు

సీత తనకి కొంచెం కూడా ఉంచకుండా మొత్తం తాగేసాడన్న షాక్ లో నోరు తెరిచి రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ తన మీసాలకి కంటిన పాలని మోచేతితో తుడుచుకొని సీత తన వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే రామ్ కళ్ళు ఎగిరేసి “ ఏంటి అందంగా ఉన్నానా???? నాకు తెలుసులే నేను అందంగా ఉంటానని!!! ఎవరైనా నన్ను చూసి ఇట్టే పడాల్సిందే లేకపోతే బ్రహ్మ తాత ఒప్పుకోలేడులే!!!! ఆయనే కదా నన్ను ఇంత హ్యాండ్సమ్ గా రెడీ చేసి భూమి మీద వదిలింది!!! “ అని తన గురించి తను గొప్పలు చెప్పుకుంటూ ఉంటే

సీత రామ్ ని పైనుంచి కింద వరకు ఒక్కసారి చూసి “ అవునవును పడాల్సిందే కానీ నీ ఫిగర్ చూసి కాదు నిన్ను చూసి పంది దోర్లే బురదలో పడాలి..... “ అని వెటకారంగా అంటూ పంచెలో ఉన్న రామ్ ని కన్నింగ్ నవ్వుతో మరోసారి చూసి ఒక్కసారిగా పంచె పట్టుకొని లాగగానే ఆ పంచె ఊడిపోయి సీత చేతిలోకి వస్తే రామ్ షాక్ తో పాటు షేక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి తన కాళ్ళ వైపు సీత చేతిలో ఉన్న పంచె వైపు చూసి

ఆ...ఆ గట్టిగా అరుస్తూ బెడ్ మీద పడుకొని బెడ్ షీట్ కాళ్ళ మీద మొత్తం కప్పుకొని “ ఒసేయ్ సిగ్గు లేదా నీకు కొంచెం కూడా??? మగాడి పంచెని లాగేస్తావా??? నా శీలం దొబ్బేద్దామని ట్రై చేస్తున్నావా??? నెవర్ అస్సలు అలా చేయనివ్వను..... నా పంచె నాకివ్వు..... “ అని కోపంగా బుసలు కొడుతూ అడిగాడు

సీతా హహహ అని విలన్ లా నవ్వుతూ “ ఏంటి రా అప్పుడే వణికి పోతున్నావు??? ముందుంది ముసళ్ళ పండగ!!! “ అంటూ దేనికోసమో రూమ్ నలుమూలలా వెతుకుతూ ఉంటే రామ్ అనుమానంగా దేనికోసమే వెతుకుతున్నావు??? అని అడిగాడు

“ హా దొరికింది ఇదిగో దీని కోసం “ అంటూ కాక్రోచ్ మీసం పట్టుకుని పైకి లేపి నవ్వుతూ రామ్ వైపు అడుగులు వేస్తూ ఉంటే కాక్రోచ్ ని చూసిన రామ్ ఏదో పెద్ద రాక్షసి బల్లిని చూసిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఆ....ఆ అని గట్టిగా అరుస్తూ “ వద్దే నీకు తెలుసు కదా నాకు కాక్రోచ్ అంటే భయం అని!!!! ప్లీజ్ నువ్వు ఇలా చేసి నన్ను భయపెట్టకు..... మమ్మీ ఇది నన్ను చంపేస్తుంది..... “ అని ఏడుపు మొహంతో అంటూ మంచం మీద కొంచెం కొంచెం జరుగుతూ బెడ్ ఏడ్జ్ వరకు వచ్చి ఉంటే

“ అయితే నువ్వు పైకి లేచి అదిగో అక్కడ కనిపిస్తుందే ఈ రూమ్ మూల అక్కడ పడుకోవాలి.... పడుకుంటావా లేకపోతే ఇది నీ షర్ట్ లో వేయమంటావా??? “ అంటూ రామ్ దగ్గరికి వచ్చి రామ్ మోహనికి ఎదురుగా కాక్రోచ్ని అటు ఇటు తిప్పుతూ అడిగింది

రామ్ వణుకుతూ “ వద్దు వద్దు వెళ్తాను ముందు నాకు పంచె ఇస్తే కట్టుకొని పోతాను...... పరాయి ఆడపిల్ల ముందు నేను ఇలా వట్టికాళ్ళ మీద నించోలేవాలంటే నాకు మహా సిగ్గబ్బా..... “ అని సిగ్గుపడుతూ తల దించుకొని అన్నాడు

రామ్ సిగ్గు ని చూసి సీత వెటకారంగా నవ్వుతూ “ అవునవును నీకు బాగా సిగ్గు అందుకే ఏమి వేసుకోకుండా పెళ్లికి ముందే నా ఎదురుగా నిలబడ్డావు!!!! కదా?? “ అని అడిగింది

ఆ సిచువేషన్ గుర్తుకువచ్చి రామ్ ఇబ్బందిగా కదులుతూ “ అదేదో పొరపాటున జరిగింది నువ్వు ప్రతిసారి దాన్ని గుర్తు చేయకు చాలా ఎంబారిసింగ్ గా ఉంది..... “ అంటూ ఉండగానే సీత ఒక్కసారిగా బెడ్ షీట్ లాగేసి “ నీ ఒంట్లో నేను చూడని ప్రదేశం అంటూ ఏమీ లేదు కాబట్టి మూసుకొని పంచె కట్టుకొని పోయి పడుకో..... “ అని అంది

రామ్ బుంగమూతి పెట్టుకుని “ నీకు నేను బాగా అలసయ్యానే అందుకే నా వీక్నెస్ ని అడ్డం పెట్టుకొని ఆడుకుంటున్నావు!!!! ఎన్ని రోజులు ఇలాగే ఉంటుందో చూస్తాను!!!! సీన్ రివర్స్ అవ్వకపోదు నీ జుట్టు నా చేతిలోకి రాక పోదు!!!! “ అని ఉక్రోషంగా చెప్పి సీత మరో చేతిలో ఉన్న పంచె లాక్కొని “ నాకు కట్టుకోవడం కూడా రాదు...... వెనక ముందు ఆలోచించకుండా పంచె లాగేసి చచ్చావు నీ జిమ్మడి పోను..... “ అని అచ్చ తెలుగు బూతులు నోట్లో నోట్లో తిట్టుకొని

కష్టంగా పంచె చుట్టుకొని నడుచుకుంటూ వెళ్లలేక పాక్కుంటూ మరి పోయి మూలన కూర్చుంటే సీత కన్నింగ్ గా నవ్వుకుంటూ కాక్రోచ్ ని కిటికీలో నుంచి బయటికి వేసి “ హమ్మ ఒక పని అయిపోయింది.... “ అంటూ దర్జాగా వెళ్లి బెడ్ మీద పడుకోగానే రామ్ ఒక్కసారిగా సీత మీదకి దూకి “ ఇప్పుడు చెప్పవే ఏంటి తెగ ఓవర్ చేస్తున్నావు??? నా దగ్గర ఆటలాడుతున్నావా??? నీ ఆటలు నా దగ్గర సాగవు!!! “ అంటూ సీత వీక్నెస్ తెలిసినట్టు నడుము మీద చేయి వేయగానే సీత నరాలు జివ్వుమని పరవశంగా కళ్ళు మూసుకుంటుంది......

సీత రియాక్షన్ చూసి రామ్ మనసులోనే నవ్వుకుంటూ చేతిని చీరలోపల నుంచి పెట్టి సీత నడుముని తడుముతూ “ ఇప్పుడు చెప్పవే నేను కింద పడుకోవాలా??? “ అని హస్కీ వాయిస్ లో సీత చెవి దగ్గర ఊపిరి వదులుతూ అడిగాడు

సీత కష్టంగా ఉహు అని అనగానే “ అది అలా రావాలి దారికి!!! “ అంటూ సీత చెవి మునిపంటితో లాగి అక్కడే ముద్దు పెట్టి పక్కకి ఒరిగి సీతకి ఆపోజిట్ సైడ్ తిరిగి గుండెల మీద చేయి వేసుకొని “ అమ్మో ఈ ఆడాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి...... దీనిని కంట్రోల్ చేద్దామనుకొని నేను కంట్రోల్ తప్పుతున్నాను..... పొరపాటున ఏమైనా జరిగిందంటే ఇది నన్ను పాతి పెడుతుంది..... “ అనుకొని కళ్ళు మూసుకోగానే

రామ్ స్పర్స దూరమైన సీత కళ్ళు తెరిచి అప్పటివరకు జరిగింది గుర్తుచేసుకొని సగటు ఆడపిల్లల సిగ్గుపడిన వెంటనే నార్మల్గా అయ్యి తనకి ఆపోజిట్ సైడ్ తిరిగి ఉన్న రామ్ ని చూసి “ చేసిందంతా చేసి ఏమి ఎరుగని పిల్లాడిలా ఎలా పడుకున్నాడో చూడండమ్మ!!! “ అని మనసులోనే అనుకుంటూ కావాలని రామ్ సైడ్ తిరిగి బాగా దగ్గరగా జరిగి ఒక చేతిని రామ్ నడుము చుట్టూ కాలిని రామ్ మీద వేసి కళ్ళు మూసుకోగానే రామ్ కి గుండె రెండు వందల స్పీడ్ పెరిగి గుటకలు మింగుతూ “ ఏం ఏం చేస్తున్నావే??? ఎందుకు కాళ్లు చేతులు నా మీద వేశావు??? తీయ్ “ అని తడబడుతూ అన్నాడు కానీ సీత చేతిని కాలనీ తీయటానికి రామ్ చేతులు రాలేదు......

సీత ముద్దుగా మొహం పెట్టి రామ్ చెవి దగ్గర గుసగుసగా “ నీకు తెలుసు కదా బావ నేను నిద్ర పోవాలంటే నా పక్కన వాళ్ళ మీద కాళ్లు చేతులు వేయాలని!!! “ అని చెప్పి ఇంకా దగ్గరగా జరిగి తన శరీరాన్ని పై పైన రామ్ కి అంటించి “ ఇప్పుడు చూస్తాను నువ్వు ప్రశాంతంగా ఇక్కడే ఎలా పడుకుంటావో??? “ అని అని నవ్వుకుంటుంది

రామ్ కి ఒంట్లో నరాలన్నీ జివ్వుమని సీతని ఏదేదో చేయమని చేతులు కాళ్లు పోరు పెడుతూ వయసు గోల చేస్తూ ఉంటే ఆ వయసుని మనసుని అదుపు చేసుకోలేక కళ్ళు గట్టిగా మూసుకొని “ ముందు నువ్వు నీ శరీరాన్ని వెనక్కి జరపవే బాబు లేకపోతే మనిద్దరి మధ్య జరగరానిది జరిగేటట్టు ఉంది..... “ అని కష్టంగా అంటాడు

“ అంటే ఏంటి బావ??? “ అని అమాయకంగా అడిగి రామ్ నడుము చుట్టూ ఉన్న చేతిని షర్ట్ లోపలి నుంచి పెట్టి నడుముని గిల్లుతుంది

రామ్ ఒక్కసారిగా సీత వైపు తిరిగి గట్టిగా హాగ్ చేసుకుని బ్యాక్ సైడ్ ఉన్న బ్లౌజ్ త్రేడ్స్ లాగేసి సీత మొహంలోకి చూసేసరికి షాక్ తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది.....

సీతని అలా చూసి రామ్ కన్నింగ్ గా నవ్వుకుంటూ వెనక్కి తిప్పి త్రేడ్స్ ఊడిన చోట తెల్లగా నోరూరిస్తున్న వీపు మీద ముద్దు పెడుతూ గట్టిగా కొరుకుతాడు.....

@@@@@@@

ఇప్పుడు మనం వీళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ చూద్దాం....

సూర్యనారాయణ గారు వీరభద్రపురం కి సర్పంచ్ గా చేస్తున్నారు..... ఆయన భార్య మహాలక్ష్మి గారు భర్త ఏది చెప్తే అదే కరెక్ట్ అని తలాడించే టైప్.....

సూర్యనారాయణ గారికి మహాలక్ష్మి గారికి ఇద్దరు పిల్లలు వీరేంద్ర గారు సుధ గారు.....

సూర్యనారాయణ గారి చెల్లెలు చెల్లెలి భర్త వాళ్ళ పిల్లలు చిన్నగా ఉండగానే యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళని సూర్యనారాయణ గారు చేరదీసి వాళ్ళ ఇంట్లోనే ఉంచి తన కొడుకు కూతురుతో పాటు సమానంగా పెంచుతారు..... వారే సురేంద్ర గారు రాధ గారు

అలా నలుగురికి యుక్త వయసు వచ్చాక ఒకరికొకరు ఇష్టమని తెలుసుకొని కుండ మార్పిడి పెళ్లిళ్ల లాగా వీరేంద్ర గారికి రాధ గారిని సుధ గారికి సురేంద్ర గారితో పెళ్లి చేస్తారు..... వాళ్ళ పిల్లలే మన హీరో హీరోయిన్ అభిరామ్ సీతామహాలక్ష్మి......

ఇంకా ఉంది.....